Lokesh:లోకేష్‌ను ఓడించడమే లక్ష్యం.. మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్ మళ్లీ మార్పు..
Send us your feedback to audioarticles@vaarta.com
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజవర్గాల సమన్వయకర్తల జాబితాలను వైసీపీ ప్రకటిస్తూనే ఉంది. ఇప్పటివరకు 8 జాబితాలను విడుదల చేయడగా.. తాజాగా 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అనూహ్య మార్పులు కనపడ్డాయి. మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యను నియమించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించి షాక్ ఇచ్చారు. అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్‌ను ప్రకటించారు.
ఈ జాబితాను పరిశీలిస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో గంజి చిరంజీవిని ఇంఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం చిరంజీవిని కూడా తప్పించి మాజీ మంత్రి మురుగోడు హనుమతంరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల కుమార్తె లావణ్యకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నియోజకవర్గంలోని వైపీపీ క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. అనంతరం 2022లో మరోసారి సీఎం జగన్ అవకాశమిచ్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించాలని భావిస్తున్నారు. గతంలో ఇంఛార్జ్‌గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించగా.. తాను చెప్పిన వారికి అసెంబ్లీ సీట్లు ఇవ్వలేదంటూ ఆయన అలకబూని పార్టీకి రాజీనామా చేశారు. దీంతో నెల్లూరు జిల్లా వాసి అయిన విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఇక కర్నూలు అసెంబ్లీ నియోకవర్గ ఇంఛార్జ్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను ప్రకటించారు. రాజకీయాల్లోకి భావించిన ఆయన ఇటీవలే తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనతంరం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్థానంలో ఇంతియాజ్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు విడుదల చేసిన తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను ప్రకటించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో ఎనిమిది స్థానాలకు(ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జ్‌లను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ), 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు.. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను.. తాజాగా 9వ జాబితాలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి సమన్వయకర్తలను వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments