close
Choose your channels

తీవ్ర ప్రజాగ్రహమే ‘లాంగ్‌మార్చ్’ సక్సెస్‌కు కారణం!

Monday, November 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తీవ్ర ప్రజాగ్రహమే ‘లాంగ్‌మార్చ్’ సక్సెస్‌కు కారణం!

జనసేన ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లాంగ్‌మార్చ్‌కు అటు టీడీపీ.. ఇటు బీజేపీ.. కార్యకర్తలు, మెగాభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్‌ అయ్యింది. కా మార్చ్‌ను అద్భుతమైన రీతిలో విజయవంతం చేసినందుకు విశాఖ జిల్లా జనసేన నాయకులను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. గత వారం రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరినీ మెచ్చుకున్నారు. విశాఖలోని ఓ హోటల్‌లో జిల్లాకు చెందిన అభ్యర్ధులు, నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

అందుకే లాంగ్‌ మార్చ్ సక్సెస్!
ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నందునే నిన్నటి కార్యక్రమం అంత విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలంటూ నేతలకు ఆయన దిశానిర్ధేశం చేశారు. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామ, మండల, పట్టణ కమిటీలను నియమించడానికి సమాయత్తం కావాలని, కమిటీల్లో జనసేన ఆవిర్బావం నుంచి నిస్వార్ధంగా పనిచేస్తున్న యువతకు తప్పనిసరిగా స్థానం కల్పించాలని, 30 శాతంకు తగ్గకుండా వారు ఉండాలని ఆదేశించారు. అదే విధంగా కమిటీల నిర్మాణంలో రాజ్యాంగ బద్దంగా దేశంలో అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలని సూచన చేశారు. పార్టీని నడపడం ఆర్ధిక భారమైనప్పటికీ విశాఖపట్నంలో ఒక చక్కటి కార్యాలయాన్ని ఏర్పాటు చేద్దామని, అందుకు సరైన వసతి ప్రాంగణాన్ని సూచించాలని కోరారు. కార్యాలయంలో రీడింగ్ రూమ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కార్యకర్తలను నాయకులు ప్రేమపూర్వకంగా ఆదరించాలని, మంచి పలకరింపు తప్ప వారు ఏమీ కోరుకోరని జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై కార్యకర్తలను కలుపుకుని వెళ్లి పోరాడాలని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ముందస్తు ప్రణాళికతోనే..!
విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను పార్టీ ముఖ్యనేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నాయకులంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం పని చేయడంతో ఈ కార్యక్రమం విజయం సాధించిందన్నారు.

నాయకత్వ శిక్షణా ఇవ్వాలి!
పార్టీ ముఖ్యనేత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా నిరంతరాయ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. కార్యకర్తల మీద అక్రమ కేసులు అధికమవుతున్నందున వారికి మద్దతుగా పార్టీ లీగల్ విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు. కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటానికి గాను రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అవగాహన కల్పించాలన్నారు. నాయకుల మధ్య అపోహలు పోవడానికి తరచుగా అంతర్గత సమావేశాలు నిర్వహించాలన్నారు. తాను కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నానన్నారు.

ఇందుకు స్పందించిన పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నుంచి బలంగా మాట్లాడే మీలాంటి వ్యక్తుల అవసరం ఉందన్నారు. మీరు ఆ ప్రాంతం మీద కూడా దృష్టి పెట్టాలని లక్ష్మీనారాయణను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రామ్మోహన్, అర్హం ఖాన్, విశాఖ జిల్లా నాయకులు బొలిశెట్టి సత్య, శివశంకర్, పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్ధులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment