అందుకే తేజ్ టైటిల్ మారుతోందట
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్, కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ముందుగా ‘అందమైన చందమామ’ అనే టైటిల్‌ను అనుకున్నారట. అయితే ఈ టైటిల్ చూస్తే.. ఇదేదో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అనుకునే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత వెల్లబుచ్చడంతో.. చిత్ర బృందం ఆ టైటిల్‌ను పక్కన పెట్టేసిందని సమాచారం. హీరో వైపు నుంచి టైటిల్ ఉండేలా ‘తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ’ అనే టైటిల్‌తో పాటు.. ‘ఇది తేజు ప్రేమకథ’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. మరి నిర్మాత ఈ రెండింటిలో ఏ టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారో.. మరి కొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments