అందుకే..ఆడియోన్స్ ప్రార్థన క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతున్నారు. - హీరోయిన్ పల్లక్ లల్వాని
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా నటించిన చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తెరకెక్కించారు. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజైన అబ్బాయితో అమ్మాయి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా అబ్బాయితో అమ్మాయి గురించి హీరోయిన్ పల్లక్ లల్వాని ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?
నాన్నగారు జితేంద్ర. హిందీ సినిమాల్లో నటించారు. అమ్మ పంజాబి. నేను ముంబాయిలో పెరిగాను. నాన్నలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. ఓ సౌత్ సినిమా ఆడిషన్ కోసం ఫోటోలు పంపించాను. డైరెక్టర్ రమేష్ వర్మ గారు నా ఫోటోలు ఎక్కడ చేసారో..ఈ సినిమాలో నటించమని ముంబాయి వచ్చి అమ్మని కలిసి కథ చెప్పారు. కథ నచ్చడంతో ఓకె చెప్పాను. అలా ఈ సినిమాలో అవకాశం వచ్చింది.
పల్లక్ కి, ప్రార్ధన క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏమిటి..?
నేను డిగ్రీ చదువుతున్నాను. కానీ... సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో లేను. ఈ సినిమాలో ప్రార్థన మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్టీవ్ గా ఉంటుంది. ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారో అలా నా క్యారెక్టర్ ఉంటుంది. అందుకనే ఆడియోన్స్ ప్రార్థన క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతున్నారు.
ఈ సినిమాలో నటించేటప్పుడు లాంగ్వేజ్ విషయంలో ఇబ్బంది పడ్డారా..?
నాకు తెలుగు రాదు కనుక డైలాగ్స్ చెప్పేటప్పుడు కాస్త కష్టంగా అనిపించింది. అయితే డైలాగ్స్ ను ముందు నుంచి బట్టీపట్టడడం...యూనిట్ సభ్యులు సహకరించడంతో పెద్దగా ఇబ్బంది ఫీలవ్వలేదు.
అబ్బాయితో అమ్మాయి గురించి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?
ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. ఇది నా మొదటి సినిమా. ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు. మోడలింగ్ కూడా చేయలేదు. అలాంటిది నా ఫస్ట్ మూవీకే ఫర్ ఫార్మెన్స్ స్కోప్ వున్న క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది. అలాగే నా క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో నటించక ముందు తెలుగు సినిమాలు చూసారా..?
బొమ్మరిల్లు సినిమా చేసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో జెనీలియా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమె నటన చూసి చాలా ఇన్ స్పైయిర్ అయ్యాను. అలాగే ఓకె బంగారం సినిమా కూడా చేసాను. దుల్కర్ సల్మాన్ చాలా బాగా నటించాడు.
తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
మహేష్ అంటే చాలా ఇష్టం. ఎవరితో నటించాలనుకుంటున్నారు అని అడిగితే...ఫస్ట్ మహేష్ పేరే చెబుతాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
ప్రస్తుతం డిష్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో మిగిలిన వివరాలు తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com