బిల్‌గేట్స్ దంపతులు విడిపోవడానికి ఆ మహిళే కారణమట..

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ విడాకుల వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. కాగా.. తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ గత ఏడాది మార్చి 13న వైదొలగిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా బోర్డు నుంచి ఆయన తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకాలపాలను విస్తృతపరిచేందుకే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

Also Read: అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే బిల్‌గేట్స్ బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందని వెల్లడించింది. బిల్‌గేట్స్ దంపతులకు కూడా ఇదే కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2000 సంవత్సరంలో బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారని.. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారని వాల్‌స్ట్రీట్ జనరల్ పేర్కొంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించిందని... బాధితురాలికి పూర్తి అండగా నిలబడిందని మైక్రోసాఫ్ట్‌ బోర్డు వెల్లడించింది.

అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్‌ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. మహిళా ఉద్యోగినితో బిల్‌గేట్స్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బిల్‌గేట్స్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది. వారిద్దరి మధ్య 20ఏళ్ల క్రితం ఈ సంబంధం ఉండేదని, 2020లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో రిలేషన్‌లో ఉన్నారని.. అయితే దీనికి.. ఆయన బోర్డు నుంచి తప్పుకోవడానికి సంబంధం లేదని ఆ ప్రతినిధి తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా భార్య మిలిందా గేట్స్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్‌ గేట్స్‌ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా.. వీరు విడిపోవడానికి యాన్‌ విన్‌బ్లాడ్‌, ఝ షెల్లీ వాంగ్‌ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మరో మహిళ కారణమంటూ వార్తలు వెలువడటం గమనార్హం.

More News

అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్ 

సౌత్ లో అనుష్క లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో

కరోనాతో కోలీవుడ్ నటుడు నితీశ్ వీరా మృతి

కరోనా మహమ్మారి కారణంగా ఎంతమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారో తెలియనిది కాదు.

ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్‌తో పాటు దాని లక్షణాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే ఇలా చేయండి..

దేశాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) ప్రజల ప్రాణాలను తీసేస్తోంది.

అద్భుతం.. మహా శివుడిని క్లిక్ మనిపించిన దేవిశ్రీ

ఆకాశంలో ఆధ్యాత్మిక అద్భుతం చోటు చేసుకుంది. అది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంట పడింది. ఇంకేముంది వెంటనే తన కెమెరాలో ఆ అద్భుత దృశ్యాన్ని బంధించి అభిమానులతో పంచుకున్నాడు.