మహిళ కాళ్లకు మొక్కిన అమితాబ్ .. ఎందుకో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ గౌరవమే. ఏడు పదుల వయసున్న ఆయన తనకంటే వయసులో చిన్నదైన ఓ మహిళ కాళ్లకు నమస్కరించారు. ఇంతకు ఆ మహిళ ఎవరో కాదు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి. అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ చేస్తున్న షో కౌన్ బనేగా కరోడ్ పతి. ఈ షో ఇప్పుడు 11వ సీజన్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ షోలో చివరి షోలో సుధామూర్తి పాల్గొన్నారు. ఆమె నేపథ్యం గురించి అమితాబ్ మాట్లాడుతూ సుధామూర్తి 60 వేల లైబ్రరీలు, వందల స్కూల్స్, 16 వేలకు పైగా టాయ్‌లెట్స్‌ను ఆమె కట్టించారని తెలిపారు.
తన స్వీయ జీవితం గురించి ఆమె చెప్పుకున్నారు. ``నేను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు నా తండ్రి వద్దన్నారు. ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరని అన్నారు. అయినా కూడా నేను ఇంజనీరింగ్ చదవాలనే నిర్ణయించుకున్నాను. కర్ణాటకలోని హుబ్లీ కాలేజీలో చేరాను. దాదాపు 600 మంది మగవాళ్లు ఉండే ఇంజనీరింగ్ కాలేజ్‌లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. నేను కాలేజ్‌లో చేరతానని అనగానే అక్కడ ప్రిన్సిపాల్ నాకు మూడు కండీషన్స్ పెట్టారు. చీర కట్టుకునే కాలేజీకి రావాలన్నారు. అలాగే క్యాంటీన్‌కి వెళ్లకూడదని అన్నారు. అబ్బాయిలతో మాట్లాడకూడదని అన్నారు. ఆయన అన్నట్లుగానే నేను పాటించాను. అయితే మూడో కండీషన్ మాత్రం ఏడాది వరకే పాటించాను. నేను టాపర్‌ని కాబట్టి.. నేను మాట్లాడకపోయినా, వాళ్లే వచ్చి నాతో మాట్లాడేవారు`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments