ఆ టైటిల్ బాలకృష్ణ కోసం కాదట
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ, అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి తరువాత మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎ.కె.47 అనే టైటిల్ నిర్ణయించారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ టైటిల్ బాలకృష్ణ చిత్రం కోసం రిజిస్టర్ చేయించలేదని సి.కళ్యాణ్ అంటున్నారు. తమ బేనర్లోనే వేరే ప్రాజెక్ట్ కోసం ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించామని.. ఇది తెలియక చాలామంది బాలయ్య సినిమా కోసమే ఈ టైటిల్ను ఫైనల్ చేశామనుకున్నారని క్లారిటీ ఇచ్చారు సి.కళ్యాణ్. కాగా.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రంలో బాలయ్య ఓ పవర్ఫుల్లో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout