మన్మథుడు 2 ఫ్లాప్ కి కారణం ఆ ఒక్క సీనే : రాహుల్ రవీంద్రన్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున వెండితెరపై చేసే రొమాన్స్ చాలా అందంగా ఉంటుంది. నాగ్ స్టైల్ కి మహిళలో అభిమానులు ఎక్కువ. అందుకే నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడు అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన మన్మథుడు చిత్రం నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆ చిత్రం అలరించింది.
మన్మథుడు టైటిల్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 తెరకెక్కించారు. కానీ మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో జంటగా నటించారు.
ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిపడేలా రొమాన్స్ ఓవర్ డోస్ అయ్యిందనే విమర్శ వినిపించింది. మన్మథుడు 2 విషయంలో ఓ పొరపాటు జరిగిందని, అందుకే ఆ చిత్రం నిరాశపరిచిందని రాహుల్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ లో తానే హోస్ట్ గా రాహుల్ ఓ స్పేస్ నిర్వహించారు.
ఇదీ చదవండి: మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్
ఈ స్పేస్ లో ఓ అభిమాని మన్మథుడు 2 చిత్రం గురించి ప్రస్తావించాడు. సినిమా ప్రారంభమయ్యాక కొన్ని నిమిషాలకు నాగార్జున ఓ అమ్మాయితో ఘాటుగా రొమాన్స్ చేస్తాడు. ఆ సీన్ బోల్డ్ గా ఉంటుంది. ఆ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డారని నెటిజన్ అన్నాడు.
దీనికి రాహుల్ బదులిస్తూ.. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు మేమంతా నవ్వుకున్నాం. ఫన్నీగా ఉంటుందనుకున్నాం. కానీ థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక ఎంత తప్పు చేశామో అనిపించింది. మన్మథుడు 2 విషయంలో ఆ సీన్ పెద్ద బ్లండర్ అని రాహుల్ అంగీకరించాడు.
ఆ ఒక్క సీన్ తో ప్రేక్షకుల అభిప్రాయం మారిపోయింది. ఆ తర్వాత కథని ఎవరూ పట్టించుకోలేదు అని రాహుల్ తెలిపాడు. మన్మథుడు 2 విషయంలో నాగ్ అభిమానులకు రాహుల్ ఇప్పటికే సారీ కూడా చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments