నేను అందుకే ఐసోలేషన్‌లో ఉన్నా: యాంకర్ ఝాన్సీ

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడటంతో ఇతర నటీనటులకు, యాక్టర్స్‌కూ కరోనా ఉందంటూ రూమర్స్ పెరిగిపోతున్నాయి. తాజాగా యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో ఝాన్సీ తన ఆరోగ్యంపై వివరణనిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

‘‘చాలా మంది నా ఆరోగ్యం ఎలా ఉందని కాల్ చేసి అడుగుతున్నారు. ఐసోలేషన్‌కు, క్వారంటైన్‌కు తేడా ఉంది. ఇటీవల నేను చేసిన పోస్ట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నా పోస్టును చూడని వాళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వర్క్‌ చేసే సెట్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది చాలా సాధారణ విషయం. అందుకే ముందు జాగ్రత్తగా నేను ఐసోలేషన్‌లో ఉన్నా. మనం అంతా తిరిగేసి ఎందరికో వ్యాప్తి చేసేకంటే రెండు వారాలు ఇంట్లో ఉండటం బెటర్.

ఇప్పటికే ఏడు రోజుల ఇంక్యుబేషన్‌ సమయం పూర్తయింది. మరో వారం రోజులు ఇంట్లోనే ఉంటా. రిస్క్‌ తీసుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ వారం తరువాత నాలో ఏమైనా సింమ్టమ్స్ బయట పడితే నేను వెళ్లి టెస్ట్ చేయించుకుంటా. నేను ఒకవేళ పాజిటివ్ అయితే నా ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తా. ఇప్పటికైతే నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అని ఝాన్సీ స్పష్టం చేసింది.

More News

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

డిజిట‌ల్ మాధ్య‌మానికి ఆడియెన్స్ నుండి ఆద‌ర‌ణ క్ర‌మంగా పెర‌గుతుంది. వెండితెర‌తో పాటు ఓటీటీ కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న టాప్‌స్టార్స్‌,

2021కి 25 కోట్ల మందికి కరోనా.. 18 లక్షల మరణాలు: ఎంఐటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి పది లక్షల మంది కరోనా బారిన పడగా..

ఆ వార్త‌ల్లో నిజం లేదట‌!!

పెద్ద స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు.

బయట తెలియని కొన్ని వాస్తవాలతో ‘నాలో.. నాతో.. వైఎస్సార్’: విజయమ్మ

మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ.. ఓ పుస్తకం రాశారు.

ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.