మొదట్లో అభ్యంతరం చెప్పినవాళ్లే ఇప్పుడు అభినందిస్తున్నారు : 'ఎఫైర్' జంట ప్రశాంతి - గీతాంజలి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో మొట్టమొదటిసారిగా.. ఇద్దరమ్మాయి ప్రేమకథ`గా తెరకెక్కిన ఎఫైర్` అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీరాజన్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరమ్మాయిులు`గా ప్రశాంతి-గీతాంజలి నటించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని ఈ ఇద్దరు భామలు మీడియాతో ముచ్చటించారు.
ముందుగా ప్రశాంతి మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు శ్రీరాజన్ నాకు మంచి మిత్రుడు. తను నాకు ఈ స్టోరి నేరేట్ చేసినప్పుడు కొంచెం సంశయించాను. ఆ తర్వాత.. ధైర్యం కూడగట్టుకొని ఈ సినిమా చేసాను. ఓ అమ్మాయి ప్రేమలో పడే మరో అమ్మాయి పాత్రను ఎఫైర్`లో నేను పోషిస్తున్నానని తెలిసినప్పుడు అందరూ అభ్యంతరం వ్యక్తం చేసారు. కానీ.. ఇప్పుడు వాళ్ళే అభినందిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా అభినందిస్తారనే నమ్మకం ఉంది. ముఖ్యంగా రాంగోపాల్వర్మగారు ఈ సినిమా రష్ చూసి.. నాకు ఫోన్ చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంగ్లీషు, లేక హిందీలో మాత్రమే ఇటువంటి బోల్డ్ సబ్జెక్ట్స్తో సినిమాలు ఎందుకు రావాలి? మన తెలుగులో ఎందుకు రాకూడదన్న పట్టుదలతో ఈ సినిమా చేసాం` అంది.
మరో కథానాయకి గీతాంజలి మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చేసినవి కొద్ది సినిమాలే అయినా.. వాటన్నిటిలో అబ్బాయితో మాత్రమే రొమాంటిక్ సీన్స్ చేసాను. కానీ.. ఎఫైర్` సినిమాలో మరో అమ్మాయితో ఎఫైర్` పెట్టుకొనేదానిగా నటించడం (నవ్వుతూ) ముందు కొంచె ఇబ్బంది అనిపించినా.. ఇప్పుడు మాత్రం చాలా ధ్రిల్లింగ్ ఉంది. ఆడియన్స్ కూడా చాలా వెరయిటీగా ఫీలవుతారు. అలా అని ఈ చిత్రంలో ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని తెలిసి.. మొదట్లో నన్ను చాలామంది భయపెట్టారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ` అయ్యాక అందరూ అభినందిస్తున్నారు. మా నిర్మాత రామసత్యనారాయణగారికి, మా దర్శకులు శ్రీరాజన్గారిని ఎప్పటికీ రుణపడి ఉంటాను` అన్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout