వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా పైవాటిలో జనసేన, ప్రజాశాంతి పార్టీలకు తాజాగా ఎన్నికల గుర్తులను ఈసీ కేటాయించడం జరిగింది. జనసేనకు ‘గ్లాసు’ గుర్తు రాగా.. ప్రజాశాంతి పార్టీ ‘హెలికాఫ్టర్’ గుర్తు వచ్చింది. అయితే హెలికాఫ్టర్.. వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయని భావించిన ఆ పార్టీ అధిష్టానం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కారు, ట్రక్కు గుర్తుతో ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఫిర్యాదుతో ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆ గుర్తును తొలగించి ప్రజాశాంతి పార్టీకి మరో గుర్తు ఇవ్వాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విజ్ఞప్తి పై ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం జరిగింది.

More News

టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!

ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నీరవ్ మోదీ నోట.. నో కామెంట్.. 8 లక్షల జాకెట్!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్లరూపాయిల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఇండియా వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారెక్కనున్న సబితా.. ఎంపీ టికెట్ ఫిక్స్!

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని అధిష్టానం సమాయత్తమవుతోంది.

కాంగ్రెస్‌ అధిష్టానంపై రేవంత్ గుర్రు!

తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు శంషాబాద్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే.

'మా' ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికలు) మినీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నటులు నరేశ్.