మా ఇద్దరి ఆలోచనలు కలవడంతో జర్నీ స్టార్ట్ చేసాం...మరిన్ని మంచి సినిమాలు అందిస్తాం - నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తవాళ్లను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన నాగార్జున తాజాగా కొత్తవాళ్లతో నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రేయా శర్మను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మించింది. జి.నాగ కోటేశ్వరరావు తెరకెక్కించిన నిర్మలా కాన్వెంట్ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ....నిర్మలా కాన్వెంట్ ఆడియో ఫంక్షన్ చాలా బాగా జరిగింది. హీరో రోషన్ చాలా బాగా మాట్లాడాడు. రోషన్ మాట్లాడుతుంటుంటే...శ్రీకాంత్, ఊహ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అలాగే నా కళ్లంట కూడా నీళ్లు వచ్చాయి. సినిమాలో చాలా బాగా నటించాడు. అలాగే శ్రేయా శర్మ కూడా చాలా బాగా నటించింది.
నిమ్మగడ్డ ప్రసాద్ గారు, నేను కలిసి బిజినెస్ చేస్తున్నాం. అయితే...ఆయన నన్ను తన బిజినెస్ లోకి తీసుకువెళితే...నేను ప్రసాద్ గార్ని సినిమా రంగంలోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరి ఆలోచనలు బాగా కలవడంతో జర్నీ స్టార్ట్ చేసాం. ఆయనకు సినిమాలంటే బాగా ఇష్టం. తెలుగు అనే కాకుండా అన్ని రకాల సినిమాలు చూస్తుంటారు. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తాం.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ విషయానికి వస్తే...మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసాను. అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. ఫస్టాఫ్ లో అక్కడక్కడా కనిపిస్తాను. సెకండాఫ్ లో సినిమా అంతా కనిపిస్తాను. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇది ఫ్రెస్ ఫ్యూర్ లవ్ స్టోరీ. ఇన్ స్పైయిరింగ్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది ఎప్పుడో కప్పుడు టచ్ అవుతుంది. సో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది అన్నారు.
నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ...ఒక క్రైమ్ స్టోరీ తీసుకున్నా...ప్రేమ అనే ఎలిమెంట్ ఎక్కడో ఓ చోట ఉంటుంది. అందుచేత ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇక నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏమిటంటే...అన్నపూర్ణ స్టూడియోస్ తో ఉన్న అనుబంధం. మేము ఎప్పుడు కలిసినా లైఫ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్ తరాలకు మనం ఏదొకటి చేయాలి అని చిన్నప్పుడు మా తాత చెప్పారు. అది నాకు బాగా గుర్తుంది. ఈ సినిమా ద్వారా చాలా మందిని పరిచయం చేస్తున్నాం. వాళ్లందర్నీ చూస్తుంటే ఇంతమంది టాలెంట్ ఉన్న యంగ్ స్టార్స్ ఉన్నారా అనిపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి కారణం అంటే ముందు జి.కె గురించి చెప్పాలి. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ చేస్తున్నప్పుడు జి.కె చాలా ఎనర్జిటిక్ గా ఉండేవాడు. ఓరోజు ఈ కథ గురించి చెప్పాడు. నాకు, నాగార్జునకు బాగా నచ్చింది. అంతే..కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని నిర్మించాం. రోషన్ అద్భుతంగా మాట్లాడాడు. అలాగే కోటి గారబ్బాయి రోషన్ చాలా మంచి ట్యూన్స్ అందించాడు. సినిమా రంగం ద్వారా ఒక్క హైదరాబాద్ లోనే 3 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అలాంటి సినిమా రంగంలో అందరికీ నచ్చేలా మరిన్ని మంచి సినిమాలు తీస్తాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout