అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఇప్పటికే 36 వేల శాంపిల్స్‌ను సేకరించామని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం 8253 శాంపిల్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏ శాంపిల్నైనా 48 గంటల లోపు మాత్రమే పరీక్షించాలన్నారు.
అప్పటి వరకూ దానిని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలన్నారు. కాబట్టి కొత్త శాంపిల్స్ సేకరిస్తే నిల్వ చేయడం ఇబ్బందవుతుందన్నారు. అంతే కాకుండా ఎక్కువ రోజుల అనంతరం పరీక్ష నిర్వహిస్తే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రత్యేక శిబిరాల ద్వారా నమూనాల సేకరణను నిలిపివేసినట్టు తెలిపారు. అయితే కరోనా లక్షణాలున్నవారిలో వివిధ ఆసుపత్రులలో పరీక్షలు యథావిధిగా జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com