కబాలి క్రేజ్ అలా ఉంది మరి....

  • IndiaGlitz, [Friday,June 10 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది. జూన్ 12న ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదలవుతుండగా సినిమా విడుదలై జూలై 1 నుండి జూలై 15కు వాయిదా పడింది.

ఈ విషయాన్ని పక్కన పెడితే బిజినెస్ విషయంలో కబాలి క్రేజ్ క్రియేట్ చేస్తున్నాడు. శాటిలైట్ హక్కులు లేకుండా తెలుగులో 32 కోట్లకు సినిమా హక్కులు అమ్ముడైపోయాయని సమాచారం. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలవుతుండటం, రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ ను బేస్ చేసుకుని ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఏయిర్ ఏషియా కూడా ఆఫీసియల్ ఎయిర్ లైన్ పార్ట్ నర్ అయ్యింది. ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ టై అప్ కావడం అంటే చిన్న విషయం కాదు..మరి కబాలి క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది.