అది చిరంజీవి గారి డ్యూటీ కాదు..: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యూస్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఆయన ఆలోచనా విధానం ఉంటుంది. ఏదైనా ఒక విషయంపై ఆయన ఎలా ఆలోచనా విధానం ఎలా ఉంటుందనేది అంచనా వేయడం చాలా కష్టం. ఇటీవల బాలీవుడ్‌ను కుదిపేస్తున్న అంశం నెపోటిజం. దీని కారణంగానే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడనేది మెజారిటి ప్రజల వాదన. ఇండస్ట్రీలోని కొందరు తనకు అవకాశాలు రాకుండా చేశారని.. 7 సినిమా అవకాశాలను పోగొట్టారంటూ దీనికి ముఖ్యంగా పలువురు ప్రముఖులే కారణమంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు కంగనా రనౌత్ కూడా దీనిని సమర్థిస్తున్నారు. దీనిపై ఓ మీడియా చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్జీవీ స్పందించారు.
నెపోటిజం అనే యాస్పెక్ట్‌ని హైలైట్ చేయడమనేది బిగ్గెస్ట్ జోక్ అన్నారు. సుశాంత్ ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటే సింపతి కూడా చూపించబోనన్నారు. ‘‘చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌ను లాంచ్ చేశారు. రామ్ చరణ్‌నే ఎందుకు లాంచ్ చేశారు? బెటర్ టాలెంట్ ఉన్నవాళ్లను ఎందుకు లాంచ్ చేయలేదు? అంటే.. అది చిరంజీవిగారి డ్యూటీ కాదే.. అది ఆయన ఇష్టం. ఆయన సంపాదించుకున్న డబ్బు.. ఫేమ్.. తన కుమారుడి కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అలాగే భావిస్తారు. ధీరూ అంబానీ తన కొడుక్కిస్తారు. ముఖేష్ అంబానీ తన కొడుక్కి ఇస్తారు. మీ కొడుక్కో... నా కొడుక్కో ఎందుకిస్తారు? మనం అనుకోవచ్చు.. వాళ్లకంటే టాలెంటెడ్ అని.. వాళ్లు అనుకోరు కదా. సుశాంత్‌కి రూ.75 కోట్ల మార్కెట్ ఉంది. అంతకంటే మంచి మార్కెట్ ఉన్న హీరోని నిర్మాత ఎంచుకోవడంలో తప్పులేదు. రూ.75 కోట్ల మార్కెట్ ఉన్న వ్యక్తే సూసైడ్ చేసుకుంటే అసలు అవకాశాలే రానివాళ్లు ఏం చేయాలి?’’ అని ఆర్జీవీ ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com