అద్గ‌ది... బంగార్రాజా మ‌జాకా

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

'సోగ్గాడే చిన్నినాయ‌నా' సినిమాను చూసిన వాళ్లంద‌రూ నాగార్జున అన్న త‌స్సాదియ్యా.. అద్గ‌దిగ‌ది అనే ప‌దాలు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది. ఎప్ప‌టినుంచో క‌ల్యాణ్ కృష్ణ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. జులై నుంచి తాజా సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఏక‌బిగిన షూటింగ్ పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్‌. సో అంతా అనుకున్న ప్ర‌కారం అయితే సంక్రాంతికి బంగార్రాజు తెర‌మీద‌కు వ‌స్తాడు. అయితే 2020 సంక్రాంతి సీజ‌న్‌ను ఏ హీరో వ‌దిలిపెట్ట ద‌ల‌చుకోవ‌డం లేదు.

మ‌హేష్ - అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి ఎయిమ్ చేసి మొద‌ల‌వుతోంది. ప్ర‌భాస్ 20వ సినిమా, అల్లు అర్జున్ 19వ చిత్రం, బాల‌కృష్ణ‌-కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ రూపొందిస్తున్న చిత్రం, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ సినిమా, క‌మ‌ల్‌-శంక‌ర్ క‌లిసి చేస్తున్న 'భార‌తీయుడు' అన్నీ సంక్రాంతికి విడుద‌ల కావాల‌న్న ఉద్దేశంతో రూపొందుతున్నాయి. వీటిలో ఎన్ని తెర‌మీద‌కు వ‌స్తాయో, ఎన్ని వాయిదాలు ప‌డ‌తాయో చూడాలి మ‌రి. ఒక‌వేళ ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేక‌పోతే మాత్రం థియేట‌ర్ల కొర‌త‌, క‌లెక్ష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో సినిమా ప‌రిశ్ర‌మ వార్త‌ల్లో ఉండ‌టం మాత్రం ఖాయం.

More News

క్షమించండి.. ఫ్యాన్స్‌కు అల్లు శిరీష్ భావోద్వేగ లేఖ

అల్లు కుటుంబం నుంచి అబ్బాయి అల్లు శిరీష్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు చేయని ప్రయత్నాల్లేవ్. ఇప్పటికే పలు సినిమాలు చేసిన అల్లువారబ్బాయి.. పెద్దగా ఏమీ వర్కవుట్ అవ్వలేదు.

పాలన పై జగన్ పట్టు.. చంద్రబాబు టీమ్ ఔట్

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించేందుకు చర్యలు షురూ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే జగన్

ప్రమాణానికి ముందు జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరిగాంధీ స్టేడియం వేదికగా..

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన 42 మంది నేతలు వీరే..

భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగన్, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు నో పర్మిషన్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.