అదే ఆమిర్ కమిట్మెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కథానాయకుడు ఆమీర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు చేసే ఆమిర్‌ఖాన్ పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకాడడు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్` సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా పేరుతో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న ఈ రీమేక్‌ను అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా.. ఇందులో ఓ సన్నివేశం కోసం ఆమిర్‌ఖాన్ పడ్డ కష్టం చూసి ఎంటైర్ యూనిట్ షాకయ్యారట. విషయమేమంటే.. సినిమా కథలో భాగంగా దేశమంతా ఆమిర్ పాత్ర పరిగెత్తే సన్నివేశం ఉందట. చాలా కీలకమైన సన్నివేశం కావడంతో దాన్ని మరోలా చిత్రీకరించలేరు. అలాగే షెడ్యూల్ ప్లాన్ జరిగిపోవడంతో దాన్ని ఇప్పుడు మార్చలేరు. ఇలాంటి సన్నివేశంలో నటించేటప్పుడు కేవలం శారీరక శ్రమే కాదు.. మానసిక సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యను దాటి వెళ్లాలంటే మందులను తీసుకుని ఆమిర్ ఆ సన్నివేశాన్ని పూర్తి చేశాడట. ఇది చూసిన వారు ఇది కదా! కమిట్మెంట్ అంటే అనుకోవడం అందరి వంతైంది.
కరీనాకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న లాల్‌సింగ్ చద్దా చిత్రంలో ఆమిర్ సిక్కు యువకుడిగా కనపడనున్నారు. పాత్ర కోసం బరువు తగ్గారట ఆమిర్. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ప్లాప్ కావడంతో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చాలా కేర్ తీసుకుని తెరకెక్కిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout