నాకు జరిగిన అవమానం నన్ను షాక్‌కు గురిచేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
తనకు జరిగిన అవమానం షాక్‌కు గురిచేసిందని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఆదివారం రోజు విజయవాడలో ఏడు గంటలపాటు జరిగిన హైడ్రామాను ఆర్జీవీ గుర్తుకు తెచ్చుకున్నారు. ఆదివారం ప్రెస్‌మీట్ రద్దవ్వడంతో పంతం పట్టి మరీ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఆర్జీవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తనను ప్రెస్‌మీట్ పెట్టుకోనివ్వక పోవడం దారుణమన్నారు. మేమేదో టెర్రరిస్టులు అన్నట్టు ప్రవర్తించారని వర్మ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విజయవాడలో తాము ఉండటానికి కూడా అంగీకరించలేదని పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తనకు సెకండరీ.. నాకు జరిగిన అవమానం నన్ను షాక్‌కు గురిచేసిందన్నారు.
వీసా తీసుకుని అక్కడ అడుగుపెట్టాలా?
"లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పటికే విడుదలైంది. కొత్తగా మాట్లాడటానికి విజయవాడలో ఏముంది?. ఏం మాట్లాడతానని పోలీసులు భయపడుతున్నారు?. నన్ను అడ్డుకొమ్మని ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలి?. కనీసం నోటీసులో కూడా పేర్కొనలేదు. ఎయిర్‌పోర్టులోకి పోలీసులు ఎలా వచ్చారు?. ప్రెస్మీట్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా?. నన్ను ఏపీకి రావొద్దని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా నార్త్ కొరియానా?. వీసా తీసుకుని అక్కడ అడుగుపెట్టాలా?. ఎల్లుండి ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుంది" అని ఆర్జీవీ మీడియాకు నిశితంగా వివరించారు.
జగన్‌పై దాడి జరిగినప్పుడు లేనిది.. ఇప్పుడేంటి..?
"నన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు ఎందుకు పంపారు? దీన్ని నోటీసులలో ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు?. అసలు ఇలా చేయమని ఎవరు చెప్పారు? అని అడిగితే ఉన్నతాధికారు అని పోలీసులు జవాబు చెబుతున్నారనీ, వారి పేర్లను మాత్రం ఎందుకు ప్రస్తావించడం లేదు?. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. జగన్ పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు ‘మాకు ఎయిర్ పోర్టు లోపల అధికారం లేదు. బయటే ఉంది’ అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మమ్మల్ని రోడ్డు పై నుంచి లాగేసి ఓ రూమ్‌లో మా అందరిని 7 గంటలు నిర్బంధించారు. జగన్ పై దాడి జరిగినప్పుడు రాలేని పోలీసులు మా విషయంలో ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చారు?. మా ఫ్రెండ్ ఇంట్లో మీడియా సమావేశం పెట్టుకోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్’ అని పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో ఈ విషయమై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నిన్నటి షాక్ నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నాను" అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments