విడుదలకు సిద్ధమైన తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది'!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ నగరానికి ఏమైంది చిత్రం తాజాగా చిత్ర యూనిట్ మరియు, కొందరు సామాన్యులకు ప్రదర్శింపబడింది. నిర్మాత సురేష్ బాబు గారు సినిమా చూస్తున్న ఆడియన్స్, చిత్ర యూనిట్ స్పందనను గమనించడం జరిగింది. సినిమా నడుస్తున్న సమయంలో ఆసక్తికర సన్నివేశాలు వచ్చినప్పుడు అరుపులు, చప్పట్లు కొట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కాని నిర్మాత సురేష్ బాబు గారు అందుకు నిరాకరించారు.
చిత్ర యూనిట్ కు ఆడియన్స్ కు సంభందం లేకుండా ఉండాలని, ఆడియన్స్ రియల్ రియాక్షన్ కావాలని సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అటు, ఇటు తిరుగుతున్నాను. సినిమా పూర్తి అయ్యింది. ధియేటర్ లో సినిమా జరుగుతోంది, నవ్వులు వినిపిస్తున్నాయి. సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. అటు నుండి సురేష్ బాబు నవుతూ గర్వంగా వెళ్ళడం చూసాను.
చిత్ర యూనిట్ అందరిని ఒకచోటుకు పిలిచి.. ''రేపు ప్రెస్ మీట్ ఉంది'' అని చెప్పి వెళ్ళిపోయాడు సురేష్ బాబు గారు. చిత్ర యూనిట్ అందరు సంతోషంగా నిలబడి ఉన్నారు. పాత సినిమాల్లో శుభం కార్డు పాడినప్పుడు అందరు ఎలా ఉంటారో అలా నటీనటులు నిలబడి ఉన్నారు.
హాల్ టికెట్ చేతికి అందింది. పరీక్ష దగ్గర పడుతోంది. జూన్ 29న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పుడు మా అసలు పరీక్ష. ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేసి ఐటి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ జీవితం బాగుండేది అనిపిస్తుంది.
'పెళ్లి చూపులు' సినిమా జూలై 29న విడుదల అయ్యింది. అది విడుదలయ్యింది నిన్ననేనా అనేలా ఉంది. శాంతి ధియేటర్ కు వెళ్లి సినిమా చూసిన రోజు గుర్తుకువస్తోంది. సినిమా చూసి బయటికి వచ్చి సురేష్ బాబు గారు పెళ్లి చూపులు సినిమా 100 రోజులు ఆడుతుందని చెప్పడం జరిగింది.
నవంబర్ 5కు పెళ్లి చూపులు సినిమా 100వ రోజు. అదే రోజు నా పుట్టినరోజు. పెళ్లి చూపులు సినిమా విడుదల తరువాత సురేష్ బాబు గారు నా రెండో సినిమా చెయ్యడానికి పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. నాకు ఆయన ఇచ్చిన ఫ్రీడం మాటల్లో చెప్పలేనిది. రెండో సినిమా ఏం చెయ్యాలి ? ఏ కథ రాయాలని చాలా ఆలోచించాను. చాలా మది దగ్గర సలహాలు తీసుకున్నాను.
తరువాత నాకు అనిపించింది, నా గురించే నేను ఎందుకు రాసుకోకూడదు అని. తరువాత నా కథను నేను రాసుకున్నాను. నా ఫ్రెండ్స్ గురించి రాయడం జరిగింది. మా జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలను కథగా రాసుకున్నాను. అలా ఈ నగరానికి ఏమైంది సినిమా కథ రాశాను.
ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయ్యాక స్క్రిప్ట్ సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన స్క్రిప్ట్ చదివాక ''మీరందరూ గోవా వెళ్ళాలి అనుకుంటున్నారా ?'' అన్నారు. అది విన్నాక మేము షాక్ అయ్యాము. తరువాత ఆయన ''మీరందరూ గోవా వెళ్లి సినిమా చెయ్యండి'' అన్నారు.
మీరు ఈ నగరానికి ఏమైంది సినిమా థియేటర్‌కు వచ్చినప్పుడు కొత్తగా ఫీల్ అవుతారు. కొత్త ఫ్రెండ్స్ ను యాడ్ చేసుకుంటారు. పాత వారిని గుర్తుకు చేసుకుంటారు. సినిమా చూస్తున్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. గోవా అలలను థియేటర్స్ లో వింటారు. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ మీ అందరికి నచ్చుతుంది. ధియేటర్ కు మీ గ్యాంగ్ తో రండి చూసుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout