ఆ..ఆలోచనే పెళ్లిచూపులు కథకు స్పూర్తి - డైరెక్టర్ తరుణ్ భాస్కర్

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

విజయ్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ‌, నందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై రాజ్ కందుకూరి, య‌స్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు. డి.సురేష్ బాబు
స‌మ‌ర్ప‌ణ‌లో పెళ్లి చూపులు చిత్రం ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా పెళ్లిచూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
మీ గురించి చెప్పండి..?
నేను హైద‌రాబాద్ లో పుట్టి పెరిగాను. సినిమాల పై మ‌క్కువ‌తో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను. నేను తీసిన‌ డ్రామా అనే షార్ట్ ఫిల్మ్ చూసి ప్రొడ్యూస‌ర్ రామ్ మోహ‌న్ గారు పిల‌వ‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర సంవ‌త్స‌రం పాటు వ‌ర్క్ చేసాను. ఆత‌ర్వాత సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీసాను. ఈ షార్ట్ ఫిల్మ్ ను సింక్ సౌండ్ లో ట్రై చేసాను. నేటివిటీకి త‌గ్గ‌ట్టు కొత్త స్టైల్ లో చేసాను. ఈ షార్ట్ ఫిల్మ్ త‌ర్వాత‌ సినిమా తీయ‌గ‌ల‌ను అనే కాన్ఫిడెన్స్ రావ‌డంతో పెళ్లిచూపులు సినిమా చేసాను.
తెలంగాణ యాస తో సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ చేసారు క‌దా కార‌ణం..?
మా ఫాద‌ర్ వ‌రంగ‌ల్ లో పుట్టిపెరిగారు. అమ్మ తిరుప‌తిలో పుట్టిపెరిగింది. ఇక నాకు భీమ‌వ‌రంలో ఫ్రెండ్స్ ఉన్నారు. అందుచేత నాకు వ‌రంగ‌ల్ యాస‌, తిరుప‌తి యాస‌, భీమ‌వ‌రం యాస్ తెలుసు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క యాస ఉంది. అయితే.. కొత్త‌గా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో తెలంగాణ యాస‌తో సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీసాను.
పెళ్లిచూపులు ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
ఫ‌స్ట్ ఈ క‌థ‌ను సురేష్ బాబు గార్కి చెప్పాను. ఆయ‌న క‌థ విని బాగుంది కానీ...సెకండాఫ్ కొంచెం బెట‌ర్ గా ఉండాలి అన్నారు. ప్రొడ్యూస‌ర్ రాజ్ కందుకూరికి ఫోన్ చేసి నా గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నారు. ఆత‌ర్వాత‌ నేను విజ‌య్ దేవ‌ర‌కొండ ద్వారా రాజ్ కందుకూరిని క‌లిసి క‌థ చెప్పాను. ఆయ‌న క‌థ విన్న వెంట‌నే ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. నేను ఏదో స‌ర‌దాగా అంటున్నారేమో అనుకున్నాను. కానీ...ఆయ‌న సీరియ‌స్ గానే చెప్పారు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
పెళ్లిచూపులు క‌థకు స్పూర్తి ఏమిటి..?
మన సినిమాలు పంచ్ డైలాగులు...ఫైట్స్, సాంగ్స్ ఇలా రెగ్యుల‌ర్ ఫార్మెట్స్ తో వ‌స్తున్నాయి. ఈమ‌ధ్య వ‌చ్చిన ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ లా రియ‌లిస్టిక్ స్టోరీస్ ఎందుకు రావ‌డం లేదు అని ఆలోచించేవాడిని. ఆ ఆలోచ‌న‌లోంచి పుట్టిందే ఈ క‌థ‌.
షార్ట్ ఫిల్మ్ తీసిన మీరు ఫ‌స్ట్ టైమ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేసారు క‌దా..ఎలా అనిపించింది..?
సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ ను సిన్క్ సౌండ్ అనే కొత్త విధానంతో చేసాను. అలాగే సినిమాను కూడా చేసాం. సీనియ‌ర్ ఏక్ట‌ర్స్ అయితే ఏ డైలాగ్ అయినా స‌రే ఈజీగా చెప్పేస్తారు. అంతా కొత్త‌వాళ్ల‌తో కాబ‌ట్టి డైలాగ్స్ వాళ్ల‌కు ముందే ఇవ్వ‌డం వ‌ల‌న టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే స్ర్కిప్ట్ లో రాసిన డైలాగే చెప్పాలి అని కాకుండా ఆ సిట్యువేష‌న్ కి వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అలా చెప్ప‌మ‌నేవాడిని. ఇలా..కొత్త‌గా ట్రై చేసాం. కానీ... ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భ‌య‌ప‌డ్డాను. అయితే సురేష్ బాబు గారు సినిమా చూసిన త‌ర్వాత ఏం టెన్ష‌న్ ప‌డ‌ద్దు బాగుంది అని చెప్పిన‌ప్పుడు ధైర్యం వ‌చ్చింది.
పెళ్లిచూపులు టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి..?
నేను అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేసాను. అందుచేత ఈ మూవీకి అనుకోకుండా అనే టైటిల్ పెట్టాల‌నుకున్నాం. కానీ..ఈ టైటిల్ వేరే వాళ్లు రిజిష్ట‌ర్ చేయించుకోవ‌డంతో కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత వివాహ భోజ‌నంబు అనే టైటిల్ అనుకున్నాం. ఫైన‌ల్ గా క‌థ‌కు పెళ్లిచూపులు టైటిల్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది అనిపించ‌డంతో పెళ్లిచూపులు అని పెట్టాం.
నెక్ట్స్ ఎలాంటి మూవీస్ చేయాల‌నుకుంటున్నారు..?
సురేష్ బాబు గారు కూడా ఇలాగే అడిగారు..? నేనైతే బ‌డ్జెట్ కంట్రోల్ లో ఉండే డిఫ‌రెంట్ మూవీస్ చేయాల‌నుకుంటున్నాను. నెక్ట్స్ ప్రాజెక్ట్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఉంటుంది.

More News

పరబ్రహ్మశాస్త్రి మరణం తెలుగు వారికి తీరని లోటు! - నందమూరి బాలకృష్ణ

మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది.

చిరు టైటిల్ పై మరో వార్త...ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది...

మెగాస్టార్ చిరంజీవి,వినాయక్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న 150వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

సూర్య కొత్త సినిమా టైటిల్.....

తమిళ హీరో సూర్య ప్రస్తుతం సింగం మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ఆ హీరోయిన్ విడాకుల విషయాన్ని తేల్చేసిన భర్త

నాయక్,ఇద్దరమ్మాయిలతో,రీసెంట్ గా మేము సహా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్

కేరళ కు ఎన్టీఆర్....

యంగ్ టైగర్,మోహన్ లాల్,కొరటాల కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.