స్టార్ హీరోతో తరుణ్ భాస్కర్
Send us your feedback to audioarticles@vaarta.com
‘పెళ్లిచూపులు, ఈనగరానికిఏమైంది’ చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. డైరెక్టర్‌గా చాలా గ్యాప్‌నే తీసుకున్నాడు. మధ్య హీరోగా, యాక్టర్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే చాలా రోజుల నుండి తరుణ్ భాస్కర్ వెంకటేశ్ కోసం డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. రేస్ కోర్స్, హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఓకథను తయారుచేశాడు. కానీ చివరకు వెంకటేశ్‌తో చర్చల అనంతరం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేయడానికి తరుణ్ భాస్కర్ స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేస్తున్నాడట తరుణ్ భాస్కర్. ఇది కాకుండా మరో క్రైమ్ డ్రామాను తెరకెక్కించడానికి ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట.
మూడో సినిమాను తనను చాలా ఇబ్బంది పెట్టిందని, రెండు పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం వచ్చిందని, బాగా ఆలోచించి ఇప్పుడు క్రైమ్ డ్రామాతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నానని, ఓ స్టార్ హీరో ఇందులో హీరోగా నటించనున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తరుణ్ భాస్కర్ ఓ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాతో బిజీగా ఉన్న వెంకటేశ్, తదుపరి ‘ఎఫ్3’ సినిమాలో నటించబోతున్నారు. మరి తరుణ్ భాస్కర్ సినిమా ఉంటుందో ఉండదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments