తను వచ్చెనంట మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్న రేష్మీ గుంటూరు టాకీస్‌తో వెండితెరపై కూడా తన గ్లామర్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు హర్రర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో జాంబీ థ్రిల్లర్ సినిమాలు కూడా రావడం స్టార్టయ్యింది. అలా జాంబీ థ్రిల్లర్‌తో పాటు కామెడి మిక్స్ చేసి జోమెడిగా రూపొందిన సినిమాయే తనువచ్చెనంట. రేష్మీ జోమెడీలో నవ్విస్తుందా? భయపెడుతుందా? అందచందాలతో మురిపిస్తుందా అనే ఆసక్తిని సినిమా ముందు నుండి ప్రేక్షకుల్లో క్రియేట్ చేసింది. మరి ఈ అంచనాలను ఏ మేర అందుకున్నామో తెలుసుకోవాలంటే కథను ఓ లుక్కేద్దాం...
కథ:
మధ్య తరగతి యువకుడైన తేజ(తేజ) ఓ మధ్య తరగతి తన కుటుంబ పరిస్థితుల కారణంగా తను ప్రేమించిన శ్వేత (ధన్యబాలకృష్ణ)ను వదులుకుని, శ్రుతి (రష్మి గౌతమ్) ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. శృతిని అందాల పోటీకి పంపాలని ఆమె తల్లి తేజ, శృతిల మధ్య దూరం పెంచుతుంటుంది. స్నేహితుడి సలహా మేర తేజ ఓ తప్పు చేస్తాడు. దాని వల్ల శృతి చనిపోతుంది. సరిగా ఆ సమయంలోనే శ్వేత మరలా తేజ జీవితంలోకి వస్తుంది. అయితే తేజ మరలా శ్వేతను పెళ్లి చేసుకున్నాడా? శ్వేతకు తేజ పెళ్లి గురించి తెలిసిన నిజాలేంటి? చనిపోయిన శ్రుతి జాంబీగా మారడానికి కారణాలేంటి? చంటి ఏమయ్యాడు? మధ్యలో ఫాదర్, అతని శిష్యులు ఏం చేశారు వంటి అంశాలతో అల్లుకున్న కథే `తను వచ్చెనంట`.
విశ్లేషణః
సినిమాకు రష్మీ గౌతమ్, ధన్య బాలకృష్ణన్‌లు చాలా పెద్ద ప్లస్ అయ్యారు. గ్లామర్‌గానే కాకుండా జాంబీగా కూడా రష్మీ నటన ఆకట్టుకుంది. చలాకీ చంటి కామెడి అక్కడక్కడా పరావాలేదనిపించింది. కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా అనిపింంచింది. రాజ్ కుమార్ సినిమాటోగ్రఫీ , రవిచంద్ర మ్యూజిక్ బావున్నాయి. పాయింట్ బాగానే ఉన్నా దర్శకుడు వెంకట్ కంచెర్ల సన్నివేశాలను నడిపించిన తీరు స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేదు. ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకోలేకపోయారన్నది వాస్తవం. సన్నివేశాల మధ్య కనెక్టివిటీ ఉన్నట్టు అనిపించదు. తేజ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. ధన్య బాలకృష్ణ ఫ్రెండ్స్ పాత్రలన్నీ అనవసరమేనని అనిపిస్తాయి. రీరికార్డింగ్ పెద్దగా మెప్పించదు. జాంబీ సినిమాలో కామెడి మిక్స్ చేసి జోమెడిగా రష్మీ గ్లామర్‌తో సినిమా అనగానే సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకు్ల్లో వచ్చిందనడంలో సందేహం లేదు. జాంబీగా రష్మి బాగానే చేసింది. కొన్నిచోట్ల ఆమె గొంతు బాగానే అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల బొంగురుగా వినిపిస్తుంది. పలు సన్నివేశాలు నమ్మబుద్ధేయవు. జాంబీని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే సన్నివేశం పండలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది. క్లైమాక్స్ ను కామెడీగా తెరకెక్కించాలనుకున్నట్టున్నారు ఆ ప్రయత్నం ఫెయిలయ్యింది. మొత్తం మీద సినిమా సాదాసీదాగా ఉంది.
బోటమ్ లైన్ః తను వచ్చెనంట...ఆకట్టుకోలేకపోయిన జోమెడి
రేటింగ్ః 2.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments