మహేశ్‌కు హిట్ ఇస్తా.. రాములమ్మకు థ్యాంక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. శుక్రవారం అనగా మే-31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, మెగా మేకర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ కార్యక్రమం అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమా గురించి, అలనాటి నటి విజయశాంతి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అందరికీ థ్యాంక్స్...
"నా లైఫ్‌లో మోస్ట్ మెమొరబుల్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్ మహేష్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. డెఫినెట్‌గా ఒక మంచి హిట్ ఫిలిం ఇచ్చి ఆయన ఋణం తీర్చుకుంటాను. ఈ సినిమా మూడు బేనర్లు కలిసి ప్రొడ్యూస్ చేయడం హ్యాపీ. ఇక ఈ సినిమాలో మంచి కాస్ట్ అండ్ క్రూ చేయబోతున్నారు. ముఖ్యంగా విజయశాంతిగారు 13 సంవత్సరాల తరువాత ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వ బోతున్నారు. ఈ సబ్జెక్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌గారు ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేయబోతున్నారు.
ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. 'భరత్ అనే నేను', 'మహర్షి' తర్వాత దేవిశ్రీప్రసాద్ మాతో జాయిన్ అవుతున్నారు. దేవిశ్రీకి థాంక్స్. మహేష్‌గారిలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి" అని అనిల్ అన్నారు. సో.. మహేశ్‌కు ఏ మాత్రం హిట్టిస్తారో.. రాములమ్మ పాత్రకు ఎలాంటి న్యాయం చేస్తారో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments