భాగమతి చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు - అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం సూపర్ హిట్ టాక్ తో... భారీ ఓపెనింగ్స్ తో.. కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అనుష్క నటన, అశోక్ డైరెక్షన్ స్కిల్స్, మాధి కెమెరా వర్క్, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, థమన్ మ్యూజిక్, యూవీ క్రెయేషన్స్ నిర్మాణ విలువలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.
ఈ సందర్బంగా భాగమతి గా అద్భుతంగా నటించిన అనుష్క మాట్లాడుతూ....
"నా కెరీర్ లో మర్చిపోలేని సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అశోక్ గారికి, యూవీ క్రియేషన్స్ బ్యానర్ టీం కు స్పెషల్ థాంక్స్. భాగమతి కోసం 4 సంవత్సరాలు గా కష్టపడ్డారు. భాగమతి చిత్రం తో ఘన విజయం అందించిన అందరికి చాలా థాంక్స్. ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ప్రయత్నిస్తాను. నా కెరీర్ ని మీ వెలకట్టలేని ప్రేమతో ... నేను నటించే ప్రతి సినిమాను ఆదరిస్తున్న నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు." అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com