థాంక్యూ హజ్బెండ్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య, సమంత అక్కినేని పెళ్లి తర్వాత కలిసి నటించిన చిత్రం `మజిలీ`. ప్రేమలో విఫలమైన ఓ యువకుడు, పెళ్లి చేసుకున్న తర్వాత అతని జీవితంలో.. అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితంలో జరిగే పరిణామాల క్రమమే ఈ సినిమా. ఎమోషనల్ కంటెంట్ ప్రధానంగానే సాగే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో సమంత గురించి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ పోస్ట్ చేసిన మెసేజ్ చైతు, సమంత రిప్లైలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ``సమంత అలియాస్ శ్రావణి అంకిత భావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఏప్రిల్ 5న మజిలీలో సమంత, శ్రావణిగా మనల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. సినిమాలో ఆమె అసమానమైన నటన చూసి షాకవుతారు`` అని దర్శకుడు ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేస్తే.. ``అవును నిజమే`` అంటూ చైతు దానికి రిప్లై ఇవ్వగా.. `థాంక్యూ హజ్బెండ్` అంటూ రిప్లై ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments