థాంక్యూ హజ్బెండ్...
- IndiaGlitz, [Sunday,March 03 2019]
నాగచైతన్య, సమంత అక్కినేని పెళ్లి తర్వాత కలిసి నటించిన చిత్రం 'మజిలీ'. ప్రేమలో విఫలమైన ఓ యువకుడు, పెళ్లి చేసుకున్న తర్వాత అతని జీవితంలో.. అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితంలో జరిగే పరిణామాల క్రమమే ఈ సినిమా. ఎమోషనల్ కంటెంట్ ప్రధానంగానే సాగే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో సమంత గురించి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ పోస్ట్ చేసిన మెసేజ్ చైతు, సమంత రిప్లైలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ''సమంత అలియాస్ శ్రావణి అంకిత భావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఏప్రిల్ 5న మజిలీలో సమంత, శ్రావణిగా మనల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. సినిమాలో ఆమె అసమానమైన నటన చూసి షాకవుతారు'' అని దర్శకుడు ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేస్తే.. ''అవును నిజమే'' అంటూ చైతు దానికి రిప్లై ఇవ్వగా.. 'థాంక్యూ హజ్బెండ్' అంటూ రిప్లై ఇచ్చింది.