మిస్సయ్యా.. ‘స్టార్’ను చేసినందుకు థ్యాంక్యూ పూరీ!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, పూజా హెగ్దే జంటగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై- టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనుండగా.. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను బుధవారం(మే 1)రోజు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా.. ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ తమకున్న అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈవెంట్లో మరిచి.. ట్విట్టర్లో..!
అనంతరం మహేశ్ కూడా మాట్లాడి తనను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేనని.. వారందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాని చెప్పుకొచ్చారు. అంతకుముందు తనను హిట్ చిత్రాలిచ్చిన శ్రీనువైట్ల, త్రివిక్రమ్, కొరటాల శివ గురించి మాట్లాడిన మహేశ్.. తనను ‘స్టార్’ను చేసి.. ప్రిన్స్‌ను కాస్త ‘సూపర్‌స్టార్’గా చేసిన పూరీ జగన్నాథ్‌ను మరిచిపోయారు. పూరీ ప్రస్తావన తన ప్రసంగంలో లేకపోవడంతో అటు అభిమానులు.. ఇటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులంతా అవాక్కయ్యారు. అయితే.. ప్రసంగం ముగిశాక ఎవరైనా గుర్తు చేశారో.. లేకుంటే ఆయనకే గుర్తొచ్చిందో తెలియదు కానీ.. తిన్నగా తేరుకుని ట్విట్టర్ వేదికగా మహేశ్ ఓ ట్వీట్ చేశారు.
ట్వీట్ సారాంశం..!
" నా స్పీచ్‌లో ఒక ముఖ్యమైన వ్యక్తిని మిస్ చేశాను. నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరీ’ చిత్రం నన్ను సూపర్‌స్టార్‌ను చేసింది. థ్యాంక్యూ యూ సో మచ్.. పూరీ జగన్నాథ్!!. ఈ సినిమాకు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ చిత్రం నాకు ఎల్లప్పుడు గుర్తుండిపోతుంది.." అని మహేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వేలాది మంది అభిమానులు రీ-ట్వీట్ చేయగా.. సుమారు పాతికవేల మంది లైక్ చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
కొందరు అభిమానులు ముందే అనుకున్నాం సార్.. మీరు పూరీ పేరు ఎందుకు మిస్ చేశారబ్బా అని.. పోనీలెండి ట్వీట్ అయినా చేశారు సంతోషం సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులు.. అసలు మీ స్పీచ్‌లో పూరీ లేకపోవడమేంటని మేమందరం షాక్ అయ్యాం సార్.. పూరీ-మహేశ్ మధ్య ఏదో జరిగిందని.. సింగిల్ ట్వీట్‌తో అనుమానాలన్నీ పటాపంచ్‌లు చేశారు.. థ్యాంక్యూ మహేశ్ గారు అని వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అభిమానులు ‘అందుకే మిమ్మల్ని సూపర్ స్టార్ అనేది మహేశ్ సార్’ అని కామెంట్ల వర్షం కురిపించారు.
Missed mentioning an important person in my speech today. In my 25 films journey, it was #Pokiri that made me a Superstar. Thank you so much @purijagan !!! Thanks for giving me Pokiri ?? A film that will always be remembered.
— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout