నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా 'థాంక్యూ'మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి కథ, మాటలను అందించారు. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మంగళవారం (నవంబర్ 23)న అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు ఈ సందర్భంగా థాంక్యూ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని కాస్త గడ్డంతో ఉన్న అక్కినేని నాగచైతన్య తిరునాళ్లలోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రంపై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోష పడుతున్నాడు. ఈ సందర్భంగా ...
నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మా థాంక్యూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నాగచైతన్య చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని కచ్చితంగా, నమ్మకంగా చెప్పగలను. బి.వి.ఎస్.రవి అందించిన అద్భతుమైన కథను డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌గారు మరింత గొప్పగా సినిమాగా మలిచారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ , ఎడిటర్ నవీన్ నూలి .. ఇలా ఓ బెస్ట్ సినిమాను అందించడానికి బెస్ట్ టీమ్ వర్క్ చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com