తని ఓరువన్ రీమేక్ ఆగిపోయింది..

  • IndiaGlitz, [Sunday,February 07 2016]

త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ ఆగిపోయింది. ఇదేంటి..త‌ని ఓరువ‌న్ రీమేక్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు క‌దా...మ‌రి ఆగిపోవ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ ఆగిపోవ‌డం వాస్త‌వ‌మే. కాక‌పోతే తెలుగు రీమేక్ కాదు. హిందీ రీమేక్.
బాలీవుడ్ లో త‌ని ఓరువ‌న్ ను స‌ల్మాన్ ఖాన్ హీరోగా త‌ని ఓరువ‌న్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కించాల‌నుకున్నారు. కానీ ఈ సినిమాలో ఎంట‌ర్ టైన్మెంట్ లేక‌పోవ‌డం వ‌ల‌నో...స‌ల్మాన్ డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల‌నో...ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ట‌. డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా త్వ‌ర‌లో వేరే సినిమా ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. తెలుగులో మాత్రం రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.