తమన్నా ఫట్... మరి కాజల్ మాటేమిటి?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో వింత పరిస్థితి ఉంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా అలాంటి సిట్యుయేషన్ ఒకటి ఎదురైంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన అబ్బాయ్ రామ్‌చరణ్‌తో 'రచ్చ' చేసి హిట్ కొట్టిన ఈ హాట్ బ్యూటీ.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. అంటే.. తొలుత అబ్బాయ్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ సుందరి.. ఆనక అతని బాబాయ్ తో మాత్రం ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది.
ఇప్పుడు తమన్నాలాగే మరో బ్యూటీ ఇదే సందర్భాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటోంది. ఆమె మరెవరో కాదు కాజల్. చరణ్‌తో 'మగధీర, నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే' చిత్రాల కోసం అతని పక్కన హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ చిన్నది.. ఇప్పుడు పవన్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్' చేస్తోంది. మరి తమన్నాలాగే ఈ సుందరి కూడా పవన్ కి కలిసి రాని హీరోయిన్గా మిగులుతుందా? ఆ సెంటిమెంట్‌ని మారుస్తుందా? వెయిట్ అండ్ సీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments