బ‌న్నీ ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న త‌మ‌న్

  • IndiaGlitz, [Tuesday,September 15 2020]

మ్యూజికల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆఫ్ టాలీవుడ్‌. ఈ ఏడాది విడుద‌లైన 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రానికి త‌మ‌న్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుద‌ల‌కు ముందు ఆడియో సాంగ్స్‌, విడుద‌ల త‌ర్వాత వీడియో సాంగ్స్ మిలియ‌న్ సంఖ్య‌లో వ్యూస్‌ను ద‌క్కించుకోగా.. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్‌చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్ రానుంద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తెలిపారు. విడుద‌లై ఎనిమిది నెల‌లు అవుతుండ‌గా ఇప్పుడేం స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌నే భావ‌న క‌లుగుతుందా? వివ‌రాల్లోకెళ్తే.. ఈ సినిమా ఒరిజిన‌ల్ ట్రాక్ సౌండ్‌ను విడుద‌ల చేయాల‌ని సంగీతాభిమానులు త‌మ‌న్‌ను రిక్వెస్ట్ చేశారు.

అభిమానుల కోరిక మేర‌కు త‌మ‌న్ ఈ సినిమా ఒరిజిన‌ల్ ట్రాక్ సౌండ్‌ను మ‌రిన్ని ట్యూన్స్ జ‌త క‌లిపి త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాన‌ని తెలిపారు. అల్లుఅర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన హ్యాట్రిక్ మూవీ ఇది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సాంగ్స్‌ తెలుగు సినిమా చరిత్రలో అధిక వ్యూస్‌ను పొందుతున్నాయి.

 

More News

ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు యత్నిస్తున్నాయి: రాజ్‌నాథ్

ఇండో- చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

సీక్రెట్‌ చెప్పేసిన చిరు..!!

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన.. మెగాభిమానులను ఆతృత కలిగించిన వార్తల్లో మెగాస్టార్‌ చిరంజీవి లుక్ ఒకటి.

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని

ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ

కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది