బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇస్తానంటున్న తమన్
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్. ఈ ఏడాది విడుదలైన `అల వైకుంఠపురములో` చిత్రానికి తమన్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందు ఆడియో సాంగ్స్, విడుదల తర్వాత వీడియో సాంగ్స్ మిలియన్ సంఖ్యలో వ్యూస్‌ను దక్కించుకోగా.. సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో సర్ప్రైజ్ రానుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. విడుదలై ఎనిమిది నెలలు అవుతుండగా ఇప్పుడేం సర్ప్రైజ్ ఉంటుందనే భావన కలుగుతుందా? వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఒరిజినల్ ట్రాక్ సౌండ్‌ను విడుదల చేయాలని సంగీతాభిమానులు తమన్‌ను రిక్వెస్ట్ చేశారు.
అభిమానుల కోరిక మేరకు తమన్ ఈ సినిమా ఒరిజినల్ ట్రాక్ సౌండ్‌ను మరిన్ని ట్యూన్స్ జత కలిపి త్వరలోనే విడుదల చేస్తానని తెలిపారు. అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో విడుదలైన హ్యాట్రిక్ మూవీ ఇది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సాంగ్స్ తెలుగు సినిమా చరిత్రలో అధిక వ్యూస్‌ను పొందుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments