మెగాస్టార్ కోసం లండన్ లో తమన్.. క్రేజీ అప్డేట్ ఇదిగో!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు తమన్. ఇటీవల తమన్ ఖాతాలో తిరుగులేని ఘనవిజయాలు చేరుతున్నాయి. దీనితో ప్రస్తుతం తమన్ చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం తమన్ బాగా ఎగ్జైట్ అవుతున్న ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసిఫెర్ రీమేక్.
ఇదీ చదవండి:
తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. దీనితో తమన్ తన పని మొదలు పెట్టేశాడు. ఈ క్రమంలో లూసిఫెర్ రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో తొలి సాంగ్ ని లండన్ లో భారీ సెటప్ తో రికార్డింగ్ మొదలు పెట్టాడు.
'ఇది నా జీవితంలో చాలా పెద్ద రోజు.. నా కల సాకారమైన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారి 153వ చిత్రం కోసం ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ లండన్ లోని ఆబ్బె రోడ్ స్టూడియోలో నిర్వహించాము. 60 మంది సంగీత కళాకారుల ఆర్కెస్ట్రా మధ్య సాంగ్ రికార్డింగ్ జరిగింది. ఇది సెలెబ్రేట్ చేసుకోవాల్సిన టైం' అని తమన్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
సాంగ్ రికార్డింగ్ కి ముందు భారీ సెటప్ తో ఉన్న స్టుడియో పిక్ ని కూడా తమన్ షేర్ చేశాడు. దీనితో చిరు 153 సంగీతం ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. మెగాస్టార్ చిత్రానికి తమన్ తొలిసారి సంగీతం అందిస్తున్నాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం తమన్ మోస్ట్ వాంటెండ్ మ్యూజిక్ డైరెక్టర్. అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, క్రాక్ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తో తమన్ దూసుకుపోతున్నాడు. చిరు 153 తో పాటు, మహేష్ బాబు సర్కార్ వారి పాట, పవన్ -రానా అయ్యప్పన్ కోషియం రీమేక్ లాంటి భారీ చిత్రాలు తమన్ చేతిలో ఉన్నాయి.
A Very biG day ??in My life a Dream Coming True Recording First Song ?? for Our Beloved #MegastarChiranjeevi gaaru @KChiruTweets #Chiru153 @AbbeyRoad Studios in #London ???? UK ?? With 60 piece Grand philharmonic Orchestra ❤️ it’s time to Celebrate Our #MegaStar It’s BIGGGGG ! ???? pic.twitter.com/eghLIJzC7N
— thaman S (@MusicThaman) July 26, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com