ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌మ‌న్ క‌స‌ర‌త్తులు

  • IndiaGlitz, [Wednesday,April 18 2018]

యువ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌కు 2018 బాగానే కలిసొస్తుంద‌నే చెప్పాలి.  సినిమాల ఫలితాల సంగ‌తి పక్కన పెడితే.. తన సంగీతంతో శ్రోత‌ల‌ను బాగానే అలరిస్తున్నారు. ముఖ్యంగా.. 'భాగ‌మ‌తి', 'తొలిప్రేమ' చిత్రాల కోసం త‌మ‌న్ అందించిన సంగీతానికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో  ఓ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతమందించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నారు త‌మ‌న్‌. ఆ చిత్ర‌మే.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ తొలి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా.

ఈ చిత్రం కోసం త‌మ‌న్ త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బ‌మ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. సంగీతంపై మంచి అభిరుచి ఉన్న త్రివిక్రమ్.. అలాగే ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న తమన్ కలయికలో పాటలంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. దాంతోపాటు.. తమన్ తొలిసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయనుండ‌డంతో ఈ సినిమా పాటలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఇప్పటికే  త్రివిక్రమ్‌కు నచ్చే విధంగా ట్యూన్స్ ఇవ్వడం కోసం కసరత్తులు ప్రారంభించార‌ట‌ తమన్. కాగా.. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

ఎన్టీఆర్ ఫ‌స్ట్‌లుక్ కోసం ఫొటోషూట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో

ఆగ‌స్టులో నాగ్‌, నాని మల్టీస్టార‌ర్‌?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న‌ విషయం తెలిసిందే.

'సాహో' గురించి ప్ర‌భాస్ ఏమ‌న్నారంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘సాహో’.

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బీహార్ ముఖ్య‌మంత్రి?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో 'జై సింహా' 100 రోజుల వేడుక

సంక్రాంతి బరిలో నిలబడి ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులను