దేవిశ్రీ సాంగ్ ని మించాల‌నే ఛాలెంజ్ గా తీసుకుని ఆ పాట చేశాను - త‌మ‌న్

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

అన‌తి కాలంలోనే...అత్యధిక చిత్రాల‌కు సంగీతం అందించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్. కిక్, కందిరీగ‌, ర‌గ‌డ‌, దూకుడు, బాద్ షా, బిజినెస్ మేన్, రేసుగుర్రం...ఇలా ఎన్నో స‌క్సెస్ ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కి సంగీతం అందించారాయ‌న‌. తాజాగా అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన స‌రైనోడు సినిమాకి త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 22న స‌రైనోడు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా స‌రైనోడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తో ఇంట‌ర్ వ్యూ మీ కోసం...

రేసుగుర్రం త‌ర్వాత మ‌ళ్లీ బ‌న్నితో వ‌ర్క్ చేసారు క‌దా..! ఎలా ఫీల‌వుతున్నారు..?

బ‌న్ని తో వ‌ర్క్ చేయ‌డం అంటే హ్యాఫీగా ఉంటుంది. త‌న సినిమాకి పాట‌లు ఎలా ఉండాలి..మ్యూజిక్ ఎలా ఉండాలి అనే విష‌యంపై బ‌న్నికి ఫుల్ క్లారిటి ఉంటుంది. అందుచేత ప్ర‌తి పాట‌కు చాలా కేర్ తీసుకుంటాడు. టెక్నిక‌ల్ గా మ్యూజిక్ పై బ‌న్నికి మంచి అవ‌గాహ‌న ఉంది. త‌న పాట‌ల‌కు సౌండింగ్ ఎలా ఉండాలో డిష్క‌స్ చేస్తుంటాడు. సో..బ‌న్నితో వ‌ర్క్ అంటే ఫుల్ హ్యాపీ.

ఈ సినిమాలో బ‌న్ని ఊర మాస్ అంటున్నాడు క‌దా...మ్యూజిక్ ప‌రంగా ఎలా ఉంటుంది..? కొత్త ఇన్ స్ట్రుమెంట్స్ ఏమైనా ఉప‌యోగించారా..?

మాస్ ఉంటూనే క్లాస్ మెయిన్ టైన్ చేసాం. అల్లు అర్జున్ స్టైలీష్ స్టార్ క‌దా...అందుక‌ని స్టైల్ ఉండేలా మ్యూజిక్ అందించాను. ఇక కొత్త‌గా ఇన్ స్ట్రుమెంట్స్ అంటే డోల్స్, పంజాబి డ్ర‌మ్స్ ఉప‌యోగించాను. బ్లాక్ బ‌ష్ట‌ర్ సాంగ్ కోసం ప్ర‌త్యేకంగా రూర‌ల్లో ఉండే డ్ర‌మ్స్ ఉప‌యోగించాను.

బోయ‌పాటి శ్రీను తో ఫ‌స్ట్ టైమ్ వ‌ర్క్ చేసారు క‌దా..! ఫ‌స్ట్ టైమ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

బోయ‌పాటి శ్రీను గారితో వ‌ర్క్ చేయాలంటే ఫ‌స్ట్ చాలా భ‌య‌ప‌డ్డాను. ఎందుకంటే...భ‌ద్ర సినిమాకి కీ బోర్డ్ ప్లేయ‌ర్ గా వ‌ర్క్ చేసాను. ఆయ‌న వ‌ర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుచేత‌ ఆయ‌న్ని ఎలా మెప్పించాల‌ని ఆలోచించాను. అయితే వారం త‌ర్వాత ఇద్ద‌రం బాగా క‌నెక్ట్ అయ్యాం. ఇప్పుడు....మ‌ళ్లీ బోయ‌పాటి గారితో ఎప్పుడు వ‌ర్క్ చేస్తామా అనిపిస్తుంది.

స‌రైనోడు ఆడియో ఫంక్ష‌న్ లో క‌మ‌ర్షియ‌ల్ మూవీకి మ్యూజిక్ అందించ‌డం క‌ష్టం అన్నారు క‌దా..కార‌ణం ఏమిటి..?

ల‌వ్ సాంగ్స్ ఎలాగైనా కొత్త‌గా చేయ‌చ్చు. అదే క‌మ‌ర్షియ‌ల్ మూవీలో ఐటం సాంగ్ చేయాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. ఐటం సాంగ్ కి ఏర‌కంగా మ్యూజిక్ అందించాల‌ని ఆలోచిస్తూ ఒక్కొక్క‌సారి డిప్ర‌ష‌న్ లోకి కూడా వెళుతుంటాం. ఐటం సాంగ్స్ తో ఆడియోన్స్ ని మెప్పించ‌డం చాలా క‌ష్టం. అందుకే అలా అన్నాను.

ఐటం సాంగ్ కోసం క‌ష్ట‌ప‌డ‌డం అనేది ఇంకా ఎన్నాళ్లు..?

క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ఉన్నంత కాలం ఐటం సాంగ్ త‌ప్ప‌దు. సంగీత్ ఫంక్ష‌న్ లో అయినా, ఏదైనా పార్టీకి వెళ్లినా ఐటం సాంగ్ ప్లే చేస్తే వ‌చ్చే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుచేత ఐటం సాంగ్ ని త‌క్కువుగా చూడ‌కండి. ఐటం సాంగ్ అని పిల‌వ‌డం క‌న్నా మాస్ సాంగ్ అని పిలిస్తే బాగుంటుందేమో.

ల‌వ్ సాంగ్స్ ఎలాగైనా కొత్త‌గా చేయచ్చు అంటున్నారు క‌దా..మీరు పూర్తి స్ధాయి ప్రేమ‌క‌థా చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మ్యూజిక్ చేయ‌లేదు..?

నేను అదే ఆలోచిస్తుంటానండీ... నాకు బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా..త‌ర‌హా పూర్తి స్థాయి ప్రేమ‌క‌థా చిత్రాల‌కు సంగీతం అందించాలి అని ఉంటుంది. కానీ..ఎవ‌రు అలాంటి సినిమాల‌కు మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. బ‌న్నికి కూడా ఓసారి చెప్పాను. ఎప్పుడైనా ల‌వ్ స్టోరీతో సినిమా చేస్తే మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని. నాలో చాలా ప్రేమ ఉంది. కానీ ఎందుక‌నో ప్రేమ‌క‌థా చిత్రానికి సంగీతం అందించే అవ‌కాశం రావ‌డం లేదు (న‌వ్వుతూ...)

త‌మ‌న్ మ్యూజిక్ అంటే అన్ని సినిమాల‌కు ఒకేలా ఉంటుంది అని చాలా మంది అంటుంటారు. ఎక్కువ సినిమాలు చేయ‌డం వ‌ల‌న అలా అంటున్నారా..? దీనిపై మీ కామెంట్ ఏమిటి..?

ఎక్కువ సినిమాలు చేయ‌డం వ‌ల‌న అలా అంటున్నారని నేను అనుకోవ‌డం లేదు. వారం గ్యాప్ లో ఒకేసారి మూడు ఆడియోలు రిలీజ్ అవ్వ‌డం వ‌ల‌న అలా అంటున్నారని అనుకుంటున్నాను. ర‌భ‌స‌, ప‌వ‌ర్, ఆగ‌డు..ఈ మూడు సినిమాల ఆడియోలు వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. అందుకే అలా అనిపించి ఉండ‌చ్చు.

చాలా మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వాళ్లే సింగ‌ర్ గా మారి పాడేస్తుంటారు క‌దా..! మ‌రి మీరు ఎక్కువుగా పాడ‌క‌పోవ‌డానికి కార‌ణం...?

నేను కొన్ని సినిమాల్లో పాడాను. కాక‌పోతే మీర‌న్న‌ట్టుగా ఎక్కువుగా పాడ‌లేదు. సిట్యువేష‌న్ కుదిరి హీరో, డైరెక్ట‌ర్ ఇద్ద‌రూ ఓకే అంటే పాడ‌తాను. అంతే త‌ప్పా ...నా ఆడియోలో నేను ఖ‌చ్చితంగా పాడాలి అని అనుకోను.

మీకు ఎవ‌రు పోటీ అనుకుంటున్నారు..?

అంద‌రూ పోటీనే అనుకుంటాను. అస‌లు పోటీ ఉంటేనే మంచి అవుట్ పుట్ వ‌స్తుంది. ఇక్క‌డో విష‌యం చెప్పాలి... దేవిశ్రీ రింగ రింగా ఐటం సాంగ్ చూసిన త‌ర్వాత బాగుంది దానికి మించిన‌ ఐటం సాంగ్ చేయాల‌నుకున్నాను. ఆత‌ర్వాత రేసుగుర్రం సినిమాలో ఐటం సాంగ్ చేయాల‌న్న‌ప్పుడు నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుని సినిమా చూపిస్త మావ‌...అనే ఐటం సాంగ్ చేసాను. అందుచేత పోటీ ఉండాల‌ని కోరుకుంటాను.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల‌నే ఆలోచ‌న ఉందా..?

ఖ‌చ్చితంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నాను. కాక‌పోతే బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ తో అంత‌గా ప‌రిచ‌యాలు లేవు. తెలుగు సినిమాలు, తెలుగు డైరెక్ట‌ర్స్ అంటే బాలీవుడ్ లో రెస్పెక్ట్ ఉంది. అందుచేత మ‌న తెలుగు డైరెక్ట‌ర్స్ బాలీవుడ్ లో మూవీ చేస్తే ఆ సినిమాకి మ్యూజిక్ అందించాల‌నుకుంటున్నాను.

ఎస్పీ బాలు గారు ట్యూన్ క‌ట్టి ఆత‌ర్వాత పాట‌ రాయ‌డం వ‌ల‌న మంచి పాట‌లు రావ‌డం లేద‌నే అభిప్రాయాన్నిగ‌తంలో వ్య‌క్తం చేసారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి..?

ప్ర‌జెంట్ ట్రెండ్ ఎలా ఉందో అలా చేయాలి. అంతే కానీ...ఎప్పుడో ఏదో జ‌రిగింది అలాగే చేయాలంటే క‌రెక్ట్ కాద‌ని నా అభిప్రాయం. శంక‌రాభ‌ర‌ణం, స్వాతిముత్యం త‌ర‌హా సినిమాలు ఇప్పుడు ఎవ‌రూ తీయ‌డం లేదు క‌దా. ఒక‌వేళ తీసినా... శంక‌రాభ‌ర‌ణం, స్వాతిముత్యం సినిమాల్లో ఐటం సాంగ్స్ పెట్ట‌లేం క‌దా. శ్రీరామ‌రాజ్యం సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకి త‌గ్గ‌ట్టే మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నాకు బాగా న‌చ్చింది. నేనే ప‌దిసార్లు చూసాను.. అలాగే...బాలు గారు కూడా మాస్, డ్యూయోట్స్, ఐటం సాంగ్స్ ...ఇలా అన్నిర‌కాల పాట‌లు పాడే ఈ స్ధాయికి వ‌చ్చారు. ఒక ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే.. ఇంత‌కు ముందు ఫిఫ్టీ ఓవ‌ర్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేవారు. ఇప్పుడు ట్వంటీ ఓవ‌ర్స్ తో ఆడుతున్నారు. అందుచేత మ్యూజిక్ కూడా అంతే కాలం త‌గ్గ‌ట్టు మారాలి అని నా అభిప్రాయం.

రీమిక్స్ సాంగ్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి..?

నాయ‌క్ సినిమాలో శుభ‌లేఖ రాసుకున్న‌...అనే రీమిక్స్ సాంగ్ చేసాను. ఆ సాంగ్ ఇప్పుడు చూసినా ఇంకా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంటుంది. రీమిక్స్ సాంగ్ చేస్తే...కంపేర్ చేస్తారు. పైగా 1980 ఆ టైంలో రిలీజైన సినిమాలు, పాట‌లు ప్రేక్ష‌కుల న‌ర‌న‌రాల్లో అలాగే ఉన్నాయి. అందుచేత రీమిక్స్ సాంగ్ చేస్తే ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డం చాలా క‌ష్టం. పైగా ఒక రీమిక్స్ సాంగ్ చేయాలంటే ప‌ది సినిమాల‌కు మ్యూజిక్ అందించ‌డానికి ఎంత క‌ష్డ‌ప‌డాలో అంతా ఒక్క సాంగ్ కోసం క‌ష్ట‌ప‌డాలి. అందుచేత రీమిక్స్ సాంగ్ చేయ‌కుండా ఉండ‌డ‌మే ఉత్త‌మం.

బాయ్స్ 2 మూవీ లో న‌టిస్తున్నార‌ని విన్నాం..నిజ‌మేనా..?

అవునండీ..బాయ్స్ 2 మూవీలో న‌టిస్తున్నాను. అంతే కాదు ఆ సినిమాకి మ్యూజిక్ కూడా అందిస్తున్నాను. అట్లీ అసోసియేట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తాం.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మ‌లినేని గోపీచంద్ తెర‌కెక్కించే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను.

More News

విక్రమ్ మూవీ డిటెయిల్స్..

చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

'24' రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24.

ఈసారి పవన్ అలా చేయలేకపోతున్నాడు....

పవన్ కల్యాణ్ కు సినిమాల తర్వాత వ్యవసాయం అంటే ఇష్టం. ఖాళీ ఉన్నప్పుడంతా మామిడి తోటకు వెళ్లి అక్కడ సమయం గడుపుతుంటాడు. సాధారణంగా సమ్మర్ టైం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడితోటలో పండ్లు పండించి ఇండస్ట్రీతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పంపిస్తుంటాడు.

అందుకు తమన్నా ఒప్పుకుంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబినేసన్ మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈచిత్రంలో మోహన్ లాల్, దేవయాని సహాలు పలువురు నటిస్తున్నారు.

అమ్మ‌వారి స‌న్నిధిలో అతిలోక సుంద‌రి..

త‌మిళ‌నాడులోని మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారు ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ది చెందింది. ఈ ఆల‌యానికి సామాన్యులు నుంచి అసామాన్యులు వ‌ర‌కు అంద‌రూ వెళ్లి అమ్మ‌వార్ని ద‌ర్శించుకుంటార‌న్న విష‌యం తెలిసిందే.