మోహన్ బాబు వ్యాఖ్యల పై స్పందించిన తమన్
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ళ విరామం తర్వాత గాయత్రి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్ బాబు. వన్ మాన్ షోగా సాగిన ఈ చిత్రంలో గాయత్రీ పటేల్‌గా మోహన్ బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సంగీత దర్శకుడైన తమన్‌పై మోహన్ బాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమన్ చాలా ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడని చెబుతూనే.. అంతకంటే ఎక్కువ బద్ధకం కూడా ఉందని చురకలు అంటించారు. ఆ బద్ధకం కారణంగా అనుకున్న సమయానికి పాటలను అందించలేడని అంటూ.. “లేజీ ఫెలో” అని ఆయన శైలిలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై తమన్ స్పందిస్తూ.. “నేను సమయానికి పాటలను అందివ్వలేకపోయిన మాట వాస్తవమే.. కాని అది బద్ధకం వల్ల కాదు. నాణ్యత కోసం ప్రయత్నించడం వలన కొంత జాప్యం జరిగింది. అయినా మోహన్ బాబు లాంటి అగ్రనటులు నాపై చేసిన ఈ వ్యాఖ్యలను నేను ఆశీస్సులుగా స్వీకరిస్తాన”ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నితిన్ సినిమా ఛల్ మోహన్ రంగ`తో పాటు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకి కూడా తమన్ బాణీలు అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com