థమన్.. రెండు క్రేజీ ప్రాజెక్టులు

  • IndiaGlitz, [Saturday,October 28 2017]

కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో మూడు హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు యువ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌. ద‌స‌రా కానుక‌గా వ‌చ్చిన మ‌హానుభావుడుతో చాలా కాలం త‌రువాత ఓ హిట్ చిత్రాన్ని త‌న అకౌంట్‌లో వేసుకున్న థ‌మ‌న్‌..

ఈ నెల 13న వ‌చ్చిన రాజుగారి గ‌ది2 తో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన త‌న తొలి హిందీ చిత్రం గోల్‌మాల్ ఎగైన్‌తో మ‌రో విజ‌యాన్ని చ‌విచూశాడు. ప్ర‌స్తుతం వి.వి.వినాయ‌క్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ చిత్రంతో పాటు.. వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత‌మందిస్తున్నాడు.

తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం.. థ‌మ‌న్ రెండు క్రేజీ ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సినిమాతో పాటు నాగ‌చైత‌న్య‌, మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రానికీ థ‌మ‌న్‌నే స్వ‌రాలు అందించ‌నున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.