మెగా హీరో కి థమన్ మ్యూజిక్

  • IndiaGlitz, [Tuesday,October 03 2017]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్‌ సీన్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, జె.పి., రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, ఆకుల శివ, ఆశిష్‌ విద్యార్థి, పవిత్ర లోకేష్‌, కాశీ విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఫిష్‌ వెంకట్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, మేకప్‌: బాషా, కాస్ట్యూమ్స్‌: వాసు, స్టిల్స్‌: శ్రీను, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: జి.జి.కె.రాజు, సతీష్‌ కొప్పినీడి, ఫైట్‌మాస్టర్‌: వెంకట్‌, కో-డైరెక్టర్స్‌: సూర్యదేవర ప్రభాకర్‌నాగ్‌, పుల్లారావు కొప్పినీడి, కో-ప్రొడ్యూసర్స్‌: సి.వి.రావు, పత్సా నాగరాజ, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

More News

మూడు భాష‌ల్లో ఒకేసారి....

2013లో స‌మ్ థింగ్ స‌మ‌థింగ్ సినిమాతో తెర‌పై హీరోగా క‌న‌ప‌డ్డ సిద్ధార్థ్ త‌ర్వాత తెలుగు సినిమాలో  న‌టించ‌నే లేదు. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత త్రిభాషా చిత్రం ద్వారా సిద్ధార్థ్ తెలుగు తెర‌పై క‌న‌ప‌డ‌నున్నాడు.

చైతు హీరోయిన్ ఎవ‌రో తెలుసా..

నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'స‌వ్య‌సాచి'. ప్రేమ‌మ్ వంటి స‌క్సెస్ త‌ర్వాత చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రానున్న సినిమా ఇది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

అక్టోబర్ 7న నెక్ట్స్ నువ్వే ఆడియో

ఆదిసాయికుమార్ హీరోగా, ప్రభాకర్.పి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.

స్పైడర్ కు కొత్త చిక్కు.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది.

'సుందరకాండ'కి 25 ఏళ్లు

రీమేక్ చిత్రాలను చేయడంలో ముందుండే తెలుగు కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన రీమేక్ చేసిన చిత్రాల్లో సింహభాగం సక్సెస్ అయ్యాయి కూడా. అలా ఘనవిజయం సాధించిన చిత్రాలలో సుందరకాండ ఒకటి.