థ‌మ‌న్ కి మ‌ళ్లీ మంచి రోజులు

  • IndiaGlitz, [Sunday,October 15 2017]

ఒక టైంలో యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ హ‌వా బాగానే సాగింది. అయితే ఇటీవ‌ల కాలంలో ఒక‌టీఅరా మిన‌హాయిస్తే థ‌మ‌న్ కెరీర్‌కి ప్ల‌స్ అయిన సినిమాలు లేవు. ఇక థ‌మ‌న్ ప‌ని అయిపోయింది అని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచాడు థ‌మ‌న్‌. గ‌త నెల 29న వ‌చ్చిన మ‌హానుభావుడుతో సంగీత ద‌ర్శ‌కుడిగా చాన్నాళ్ల త‌రువాత జెన్యూన్ హిట్‌ని సొంతం చేసుకున్న థ‌మ‌న్‌.. తాజాగా రాజు గారి గ‌ది2తో మ‌రో విజ‌యాన్ని త‌న సొంతం చేసుకున్నాడు.

ఈ రెండు చిత్రాల విజ‌యాల‌లోనూ థ‌మ‌న్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీల‌క పాత్ర పోషించింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఏదేమైనా థ‌మ‌న్‌కి మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయ‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ వారంలోనే త‌న తొలి హిందీ చిత్రం గోల్‌మాల్ ఎగైన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు థ‌మ‌న్‌. మ‌ళ్లీ మంచి రోజులు ప‌ల‌క‌రిస్తున్న ఈ త‌రుణంలో థ‌మ‌న్‌కి ఈ హిందీ సినిమా కూడా ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. కాగా, సాయిధ‌ర‌మ్‌తో జ‌వాన్‌, వి.వి.వినాయ‌క్ చిత్రాల‌ను చేస్తున్న థ‌మ‌న్‌.. వ‌రుణ్‌తేజ్‌ తొలిప్రేమ‌తో పాటు నితిన్ తాజా చిత్రం కూడా చేస్తున్నాడు.

More News

స‌మ‌ర‌సింహారెడ్డి తేదిన వ‌స్తున్న బాల‌య్య‌

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో స‌మ‌ర‌సింహారెడ్డి ఒక‌టి. ఫ్యాక్ష‌న్ చిత్రాల ట్రెండ్ ఈ చిత్రంతో ఊపందుకుంది. 1999లో జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాసి చ‌రిత్ర సృష్టించింది అప్ప‌ట్లో.

రామ్ ద‌ర్శ‌కుడితో నాని?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. ప్ర‌స్తుతం అదే చిత్ర క‌థానాయ‌కుడు రామ్‌తో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

గోపీచంద్‌తో మ‌రోసారి..

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ క‌థానాయ‌కుడు అనిపించుకున్నాడు  మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ర‌వితేజ కెరీర్‌లో 'రాజా ది గ్రేట్' బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌,  డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'.

జవాన్ మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.