వకీల్ సాబ్ : మతిపోగొడుతున్న నెల్లూరు కుర్రాళ్లు.. తమన్ ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పింక్ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కోరుకునే విధంగా ప్రజెంట్ చేశాడు. సినిమాలో మాస్ ఎలివేషన్స్, పవన్ స్టైల్, యాక్షన్స్ సన్నివేశాలు పక్కాగా కుదరడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.
వకీల్ సాబ్ ఇప్పటికే ఓటిటిలోకి కూడా వచ్చేసింది. అయినప్పటికీ వకీల్ సాబ్ మానియా ఇంకా తగ్గలేదు. సినిమాల్లో సూపర్ హిట్ అయిన సన్నివేశాలని యూట్యూబ్ లో రీక్రియేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా నెల్లూరుకు చెందిన కొందరు కుర్రాళ్లు వకీల్ సాబ్ ఫైట్ సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ వీడియో దుమ్ము దులిపే విధంగా ఉంది.
కుర్రాళ్లు చేసిన ఫైట్ లోని ప్రతిషాట్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఉపయోగించుకుంటూ కుర్రాళ్లు చెలరేగిపోయారు. నెల్లూరు కుర్రాళ్ల వర్క్ చూసి తమన్ సైతం ఫిదా అయ్యాడు. దర్శకుడు బివిఎస్ రవి కూడా ప్రశంసలు కురిపించాడు.
ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ మూవీ పవన్ అభిమానుల ఆకలి తీర్చింది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ నుంచి వచ్చిన మూవీ ఇదే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పవన్ అయ్యప్పన్ కోషియం రీమేక్, హరిహరవీర మల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు.
Seriously what did i see ❤️❤️❤️❤️❤️❤️
— thaman S (@MusicThaman) May 23, 2021
This guys nailed it those high speed shots syncing the music ?? to the shots ???????????? Wow ?? crazy #VakeelSaabBGM #VakeelSaabOnPrime #VakeelSaab ??????♂️?? https://t.co/Hct2eyFyI5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments