త‌మ‌న్ సెంచ‌రీ...

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ జోరుమీదున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ‌న్ ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. త‌క్కువ స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు సంగీతాన్ని అందించేశాడ‌ట త‌మ‌న్‌.

ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అదీ గాక ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన 'అర‌వింద స‌మేత‌'తో ఈ రికార్డు అందుకోవ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు రిపీటెడ్ ట్యూన్స్‌.

కాపీ ట్యూన్స్ కొడ‌తాడ‌నే పేరు తెచ్చుకున్నత‌మ‌న్ తొలి ప్రేమ సినిమా నుండి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సరికొత్త సంగీతంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు త‌మ‌న్‌.