‘‘రాధేశ్యామ్’’ కోసం తమన్‌ను దించిన యూవీ క్రియేషన్స్.. బీజియమ్ అదిరిపోవాలంతే...!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్యకాలంలో తమన్ సాంగ్స్, బీజియమ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి పేరొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే విమర్శకుల మాట. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు తమన్‌కు అప్పగించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్స్ కోసం మిథూన్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ లను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాదిలోని మిగిలిన అన్ని భాషల్లో ‘‘రాధేశ్యామ్’’కు జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దక్షిణాది భాషలన్నింటికి తమన్ బీజియమ్ అందిస్తున్నట్లు ఆదివారం అఫీషియల్‌గా వెల్లడించింది యూవీ క్రియేషన్స్.
కాగా.. బాహుబలి, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ థియేటర్స్‌లో సందడి చేయనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
మరోవైపు వరుస సినిమాలతో బిజీగా వున్న ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ప్రాజెక్ట్ కే’’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తుండగా... బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు `సలార్`, `ఆదిపురుష్` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments