Leo:యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న విజయ్ 'లియో' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజా సినిమా లియో ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కొద్ది సేపటి క్రితమే విడుదల ఈ ట్రైలర్ విడుదలైన గంటలోనే 5 మిలియన్లకు వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌లో విజయ్ యాక్షన్ సీన్స్, అనిరుథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
డబుల్ రోల్‌లో నటిస్తున్న విజయ్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్..
ఇక ట్రైలర్‌లో విజయ్ డైలాగ్స్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. నా లాగే ఎవడో ఉన్నాడని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ విజయ్ చెప్పిన డైలాగ్ చూస్తుంటే మూవీలో విజయ్.. డబుల్ రూల్‌లో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇక చివర్లో మరో విజయ్ పాత్ర విజిల్ వేసుకుంటా రావడం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌గా ఉంది.
విజయ్‌కు విలన్లుగా సంజయ్ దత్, అర్జున్..
ఇక ఈ సినిమాలో విలన్లుగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. పోలీస్ అధికారిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించారు. దసరా కానుకగా ఈ నెల 19న లియో మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments