Leo:యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న విజయ్ 'లియో' ట్రైలర్

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజా సినిమా లియో ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కొద్ది సేపటి క్రితమే విడుదల ఈ ట్రైలర్ విడుదలైన గంటలోనే 5 మిలియన్లకు వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌లో విజయ్ యాక్షన్ సీన్స్, అనిరుథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

డబుల్ రోల్‌లో నటిస్తున్న విజయ్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్..

ఇక ట్రైలర్‌లో విజయ్ డైలాగ్స్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. నా లాగే ఎవడో ఉన్నాడని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ విజయ్ చెప్పిన డైలాగ్ చూస్తుంటే మూవీలో విజయ్.. డబుల్ రూల్‌లో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇక చివర్లో మరో విజయ్ పాత్ర విజిల్ వేసుకుంటా రావడం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌గా ఉంది.

విజయ్‌కు విలన్లుగా సంజయ్ దత్, అర్జున్..

ఇక ఈ సినిమాలో విలన్లుగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. పోలీస్ అధికారిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించారు. దసరా కానుకగా ఈ నెల 19న లియో మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, గ్లింప్స్, ఫస్ట్‌ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్‌ సినిమా తర్వాత విజయ్‌, లోకేశ్‌ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More News

TDP, Pawan:40 ఇయర్స్ టీడీపీకి పవన్ కల్యాణే పెద్ద దిక్కు ఎందుకు అయ్యారు..?

నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ.. సినిమాలతో పాటు రాజకీయాలను శాసించిన దివంగత సీఎం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ..

BRS: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు చెక్ పెట్టనుందా..? కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలకు ధీటుగా ఉచిత హామీలు..?

తెలంగాణలో మరో నెల, రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి.

తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా..? 32 సీట్లలో డిపాజిట్లు దక్కేవి ఎన్ని ?

తెలంగాణలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Vishal:సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణల ఎఫెక్ట్  : రంగంలోకి సీబీఐ, నలుగురిపై కేసులు.. ముంబైలో సోదాలు

ఇటీవల ముంబైలోని సెన్సార్ బోర్డుపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Telangana Voters:తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. 22లక్షల ఓట్లు తొలగించాం: సీఈసీ

తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. 2022-23లో 22లక్షల ఓట్లను తొలగించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.