‘తలైవి’ ట్రైలర్ ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్. డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఈ బాలీవుడ్ క్వీన్ ఇప్పుడు తమిళనాడు విప్లవ నాయకురాలు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను 'తలైవి' పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్‌ను కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. అది కూడా రెండు ప్రధాన నగరాలైన చెన్నై, ముంబైలలో విడుదల చేస్తారట. కంగనా రనౌత్, అరవింద స్వామి, దర్శకుడు విజయ్, నిర్మాతలు విష్ణు, శైలేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారట.
కంగనా జయలలితగా చేస్తున్న ఈ చిత్రంలో శశికళ పాత్రలో పూర్ణ, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌గా అరవిందస్వామి, మరో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్, శోభన్‌బాబు పాత్రలో జిస్సుసేన్ గుప్తా తదితరులు నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com