జయలలితగా అదరగొట్టిన కంగనా

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

సినిమాలు, రాజకీయాలు రెండింటిలో గొప్పస్థాయికి ఎదిగింది. సినిమాలు తనను సూపర్ స్టార్ గా నిలబెడితే... రాజకీయాలు తనను సీఎం ను చేశాయ్. అంతకు మించి తమిళుల అమ్మ తలైవిగా అనుబంధాన్ని పెంచాయ్. ఆమె ఎవరో కాదు జయలలిత. అలాంటి మహానాయకురాలు, మహానటి జీవిత చరిత్ర పై ఇప్పటికే చాలా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయ్. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తలైవి.  విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ ఇచ్చింది యూనిట్. జూన్ 26 2020లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసి... జయలలిత అభిమానులు, ప్రేక్షకులకు డబుల్ హ్యాపినెస్ ఇచ్చింది.

బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్లలో ఒకరైన కంగనా... ఈ పాత్రలో చక్కగా ఒదిగి పోయారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. టీజర్ లో అటు హీరోయిన్ గా  మెప్పించిన కంగనా... ఇటు రాజకీయ నాయకురాలిగాను జయలలిత లుక్ లో అదరగొట్టేశారని చెబుతున్నారు. మొత్తానికి  తలైవి టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కాగా సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తుండగా... ఎన్టీఆర్ పాత్ర కోసం తారక్ ను సంప్రదించింది చిత్ర యూనిట్. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట నిర్మాతలు. కానీ తాత పాత్రకు తాను న్యాయం చేయలేనని ఎప్పుడూ చెబుతూనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్... ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.