బాహుబలి 2, అవెంజర్స్ రికార్డ్ బ్రేక్.. ఫస్ట్ లుక్ రాకముందే సంచలనం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్ లలో తమ అభిమాన హీరోలని ఫ్యాన్స్ ఆరాధ్య దైవంలా భావిస్తారు. ఈ తరహా వైఖరి ఈ రెండు ఇండస్ట్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తమ అభిమాన హీరోల సినిమాల రిలీజ్ రోజునైతే హంగామా మోతెక్కిపోతుంది. తమిళ నాట తలా అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
విజయ్, అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించారు. బాహుబలి 2, అవెంజర్స్ పేరిట ఉన్న రికార్డులని తుడిచిపెట్టేశారు.
వివరాల్లోకి వెళితే.. గత కొన్ని వారాలుగా అజిత్ అభిమానులు 'వాలిమై' ఫస్ట్ లుక్ కావాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ఫలితంగా ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో లో వాలిమై కి ఇంప్రెషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా బాహుబలి 2, అవెంజర్స్ రికార్డులు బద్దలయ్యాయి.
బాహుబలి 2 రిలీజ్ కు ముందు ఈ చిత్రాన్ని ఎంతమంది చూడాలనుకుంటున్నారా అని బుక్ మై షో సర్వే నిర్వహించగా.. 1 మిలియన్ ఇంట్రెస్ట్ లు వచ్చాయి. అదే అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రానికి 1.70 మిలియన్ ఇంట్రెస్ట్ లు వచ్చాయి. ఈ రెండు చిత్రాల రికార్డులని అజిత్ వాలిమై చిత్రం ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే బ్రేక్ చేసింది. 'వాలిమై' చిత్రానికి 1.73 మిలియన్ ఇంట్రెస్ట్ లు రావడం విశేషం. దీనిని బట్టే అర్థం అవుతోంది అజిత్ అభిమానులు వాలిమై కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అని.
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com