తిక్క కొత్త టీజర్ వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, మన్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం తిక్క. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర మూవీ బ్యానర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తిక్క కొత్త టీజర్ ను నిన్న రిలీజ్ చేయాలి కానీ..కొన్ని కారణాల వలన వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేసారు.
ఈ టీజర్ విషయానికి వస్తే... అక్కినేని నటించిన దేవదాసు చిత్రంలోని జగమే మాయ... అనే సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. ఆతర్వాత తాగోబోతు రమేష్...ప్రేమ బబ్బుల్ గమ్ లాంటిది ముందు తియ్యగా ఉంటుంది తర్వాత చప్పగా అయితది. ప్రేమ కోసం హీరో ఏమిటి టెర్రరిస్ట్ కూడా అయిపోతాడు అంటున్నాడు.ఇక తేజు యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్మెంట్ చేస్తూ కనిపించాడు. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే...యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ సమపాళ్లలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఓ పాట పాడడం విశేషం. ఈ చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com