థియేటర్స్ బంద్ కు సహకరిస్తోన్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు - టిఎఫ్ సిసి ఛైర్మన్

  • IndiaGlitz, [Saturday,March 03 2018]

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ శుక్ర‌వారం నుండి ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా థియేటర్ల బంద్ చేసిన విష‌యం తెలిసిందే. థియేట‌ర్ల బంద్ విజ‌య‌వంతంగా జ‌రుగుతున్న సంద‌ర్భంగా తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ శ‌నివారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ మాట్లాడుతూ...''శుక్ర‌వారం నుండి త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ర్టాల‌లో థియేట‌ర్స్ బంద్ స‌క్సెస్ ఫుల్ గా జ‌రుగుతోంది. దీనికి స‌హ‌క‌రిస్తోన్న ఐదు రాష్ట్రాల నిర్మాత‌ల‌కు, డిస్ర్టిబ్యూట‌ర్స్ కు, ఎగ్జిబీట‌ర్స్ కు, ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా.మొద‌టి నుంచి డిజిటల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ విధానం పై మేము పోరాటం చేస్తూ వ‌చ్చాం. ఇప్పుడు నాలుగు భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ ఒకే తాటిపైకొచ్చి ఒక జేఏసిగా ఏర్పడి డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ ఛార్జీస్ త‌గ్గే వ‌ర‌కు పోరాటం చేయ‌డం శుభ ప‌రిణామం. మేము కూడా వారికి అన్ని విధాలుగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తూ వారితో క‌లిసి ముందుకెళ్తున్నాం. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ దిగే వ‌చ్చే వ‌ర‌కు అంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని కోరుకుంటున్నా. థియేట‌ర్స్ బంద్ వ‌ర‌కు వ‌చ్చారంటే డిజిట‌ల్ రేట్ల వ‌ల్ల నిర్మాత‌లు ఎంత న‌ష్ట‌పోతున్నారో, ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఎన్నో చిత్రాలు విడుద‌ల‌కు కూడా నోచుకోకుండా ఉన్నాయి. క్యూబ్ , యుఎఫ్ఓ, పిఎక్స్ డి వారు ఐదేళ్ల త‌ర్వాత ఫ్రీ స‌ర్వీస్ చేస్తామ‌ని చేసిన అగ్రిమెంట్ కు క‌ట్టుబ‌డి ఉండండి. లేదా ఛార్జెస్ త‌గ్గించండి. లేదంటే మీరు ప‌క్క‌కు తొలిగితే మేము కొత్త కంపెనీల‌తో ముందుకెళ్తాం. మా డిమాండ్స్ తీరే వ‌ర‌కు థియేట‌ర్స్ బంద్ మాత్రం ఆగ‌దు. ఇక మీద‌ట కూడా అంద‌రూ థియేట‌ర్స్ బంద్ కు స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నా''అన్నారు.

టిఎఫ్ సిసి సెక్ర‌ట‌రీ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...''థియేట‌ర్స్ బంద్ కు స‌హ‌క‌రిస్తోన్న సౌత్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ర్టీ వారికి నా ధ‌న్య‌వాదాలు. ఇకనైనా డిజిటల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారు మొండి వైఖ‌రి మానుకొని దిగివ‌స్తే మంచిది. లేదంటే మా డిమాండ్స్ తీరే వ‌ర‌కు థియేట‌ర్స్ బంద్ కొన‌సాగుతూనే ఉంటుంది'' అన్నారు.

More News

బోయపాటికి భారీ పారితోషికం?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే.

ఛల్ మోహన్ రంగ: 'వారం' గీతం విడుదల

'ఫస్టు లుక్కు సోమవారం,మాట కలిపే మంగళవారం' అంటూ మన యువ కథానాయకుడు నితిన్

నానితో మహేష్ డైరెక్టర్?

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యువ కథానాయకుడు..

వెంకీ, శ్రియ ఇద్దరికీ ఒకేలా..

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

రవితేజ చిత్రంలో ఒకరేనట..

గత ఏడాది 'రాజా ది గ్రేట్'చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మహారాజ రవితేజ.