'టెర్రర్ ' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాంత్, నికిత హీరో హీరోయిన్లుగా భారత క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం టెర్రర్`. షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో ..చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే తృప్తి కలిగింది. నటుడుగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై మంచి కథలతో సినిమాలు చేస్తాను. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్ష్ అని హీరో శ్రీకాంత్ అన్నారు. నిర్మాతగా తొలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. హీరోగారు సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్, సాయికార్తీక్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్ళాయి. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని నిర్మాత షేక్ మస్తాన్ అన్నారు. నిర్మాత షేక్ మస్తాన్ గారు ఎంత దేశభక్తుడో సినిమా చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడిగా నాకు ఫ్రీడం ఇచ్చి సినిమా అవుట్ పుట్ చక్కగా వచ్చేలా చూసుకుని సినిమాను స్వంతంగా రిలీజ్ చేసుకున్న గట్స్ ఉన్న వ్యక్తి అని దర్శకుడు సతీష్ కాశెట్టి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments